HBD Pawan Kalyan: ''మనల్ని ఎవడ్రా ఆపేది''.. గీతా ఆర్ట్స్ నుంచి గూస్ బంప్స్ తెప్పిస్తున్న పవర్ స్టార్ మ్యాషప్ వీడియో!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థ ఆయనకు బర్త్ డే విషెష్ తెలియజేస్తూ అదిరిపోయే మ్యాషప్ వీడియో రిలీజ్ చేసింది.

New Update

HBD Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా అంతా ఆయన బర్త్ డే విషెస్ తో కళకళలాడుతోంది. మ్యాషప్ వీడియోలు, బర్త్ డే పోస్టర్లతో సందడి చేస్తున్నారు ఫ్యాన్స్. సామాన్యులు నుంచి  సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల వరకు అందరూ సోషల్ మీడియా వేదికగా పవన్ కి బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ సంస్థ  అదిరిపోయే మ్యాషప్ వీడియోతో బర్త్ విషెస్ తెలిపింది. ది లీడర్, ది స్టార్, ది ఫేనామినన్.. ప్రియమైన పవర్ స్టార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు. ''తెరపై మీ వీరత్వం, తెర బయట మెరుగైన రేపటి కోసం మీ దార్శనికతతో లక్షలాది మందికి స్పూర్తినిస్తూ మీ ప్రయాణం కొనసాగాలి'' అంటూ పవన్ మ్యాషప్ వీడియోను షేర్ చేశారు. 

బర్త్ డే స్పెషల్  మ్యాషప్ వీడియో 

‘ఈశ్వరా.. పవనేశ్వరా..’ అంటూ మొదలైన ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది.  పవన్ సినీ కెరీర్, పొలిటికల్ ఎంట్రీ, రాజకీయాల్లో ఆయన ఎదిగిన తీరు వంటి అంశాలను ఇందులో చూపించారు. వీడియోలో పవన్ డైలాగ్స్, ఎమోషనల్ స్పీచ్ లు అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి.  ''రావడం ఆలస్యం అవ్వొచ్చు.. కానీ రావడం మాత్రం పక్కా'',  ''మనల్ని ఎవడ్రా ఆపేది''.. ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్పోడు వంటి డైలాగ్స్  వీడియోలో హైలైట్ గా నిలిచాయి. ప్రస్తుతం ఈ మ్యాషప్ వీడియో నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. 

Also Read: HBD Pawan Kalyan: రాజమౌళి సినిమాతో పాటు పవన్ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే !

Advertisment
తాజా కథనాలు