HBD Pawan Kalyan: రాజమౌళి సినిమాతో పాటు పవన్ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలివే !

నేడు ఆంద్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం..

New Update
pawan kalyan

pawan kalyan

HBD Pawan Kalyan: టాలీవుడ్  పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు తన 51వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పవన్ సినీ కెరీర్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.. అయితే సినిమా ఇండస్ట్రీలో కొన్ని సార్లు ఒక హీరో చేయాల్సిన సినిమా మరో హీరోకు వెళ్లడం సహజం. అలా కొందరు హీరోలు వదులుకున్న సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ గా నిలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా పవన్ కళ్యాణ్ కూడా తన కెరీర్ లో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు వదులుకున్నారు. అవేంటో మీకు తెలియాలంటే ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి. 

పవన్ వదులుకున్న బ్లాక్ బస్టర్ సినిమాలు

అతడు

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అతడు సినిమా కథను ముందుగా పవన్ కే చెప్పారట.  కానీ కొన్ని కారణాల చేత  ఆ సినిమా మహేష్ బాబు చేతికి వెళ్ళింది. అతడు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది క్లాసిక్ హిట్‌గా నిలిచింది.

నువ్వే కావాలి

దర్శకుడు కె. విజయ్ భాస్కర్ నువ్వే కావాలి చిత్రాన్ని  మొదట పవన్ కల్యాణ్‌తో ప్లాన్ చేశారట. కానీ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. అదే కథతో తరుణ్ హీరోగా 'నువ్వే కావాలి' పేరుతో సినిమాను విడుదల చేయగా, అది ఒక ట్రెండ్ సెట్టర్‌గా మారింది.

విక్రమార్కుడు

రాజమౌళి తన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ విక్రమార్కుడు సినిమాలో మొదట పవన్ ని హీరోగా అనుకున్నారట.  కానీ పవన్ బిజీగా ఉండడం, కాల్షీట్లు కేటాయించలేకపోవడంతో ఈ సినిమా రవితేజతో చేశారట. ఆ తర్వాత రెస్ట్ ఈజ్ హిస్టరీ.  ఇదొక పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

ఇడియట్

రవితేజ  బ్లాక్ బస్టర్ హిట్ 'ఇడియట్' మూవీ కథను ఫస్ట్ పవన్ కళ్యాణ్ కి వినిపించారట డైరెక్టర్ పూరీ జగన్నాథ్. కానీ, పలు కారణాల చేత ఆయన రిజెక్ట్ చేయడంతో.. ఈ సినిమా రవితేజ చేతికి వెళ్ళింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. ఇడియట్ రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఆయన కెరీర్ కి ఒక టర్నింగ్ పాయింట్ గా మారింది.   .

అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి

పూరి జగన్నాథ్ తెరకెక్కించిన మరో సినిమా అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి కూడా ఫస్ట్ పవన్ చేతికే వెళ్లిందట. అయితే కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఈ సినిమాను తిరస్కరించారట పవన్. ఇది కూడా బాక్సాఫీస్ వద్ద పెద్ద విజయం సాధించింది. 

పోకిరి

మహేష్ బాబు ఆల్ టైం సూపర్ పోకిరి కథను కూడా పూరి జగన్నాథ్ ముందుగా పవన్ కే వినిపించారట. కానీ, అది ఆయన వదులుకోవడంతో ఆ అవకాశం మహేష్ బాబుకు లభించింది. ఇది కూడా మహేష్ బాబు కెరీర్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాతో యువతలో మహేష్ బాబు క్రేజ్ కూడా అమాంతం పెరిగింది. 

Advertisment
తాజా కథనాలు