/rtv/media/media_files/2025/08/25/raghav-2025-08-25-13-00-19.jpg)
బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమె భర్త, ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా, తల్లిదండ్రులు కాబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ జంట తమ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ ఈ శుభవార్తను ప్రకటించారు. మా చిన్న ప్రపంచం వస్తోంది అని క్యాప్షన్‌లో రాశారు. ఈ ప్రకటనతో పాటు, వారు ఒక అందమైన వీడియో, ఫోటోను షేర్ చేశారు. ఫోటోలో "1 + 1 = 3" అనే అక్షరాలతో ఒక ప్లేట్‌పై ఉన్న కేక్, చిన్న పాదాల ముద్రలు ఉన్నాయి. వీడియోలో వారు ప్రకృతిలో చేతులు పట్టుకుని నడుస్తున్నట్లుగా చూపించారు. ఈ శుభవార్తతో సోషల్ మీడియాలో సెలబ్రిటీలు మరియు అభిమానుల నుండి వారికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కాగా పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా 2023 సెప్టెంబర్ 24న రాజస్థాన్‌లోని ఉదయపూర్‌లో వివాహం చేసుకున్నారు.
Actress Parineeti Chopra and Politician Raghav Chadha are going to be parents soon. Couple announced pregnancy with an adorable post.#parineetichopra#raghavchadha#pregnancy#parents@raghav_chadha@ParineetiChopra#Bollywood#bollywoodactress#entertainment#EntertainmentNewspic.twitter.com/UD3IpQoE3p
— Manchh (@Manchh_Official) August 25, 2025
మంచి గాయని కూడా
పరిణీతి చోప్రా 1988 మే 21 న హర్యానాలోని అంబాలాలో జన్మించారు. ఆమె ప్రముఖ నటి ప్రియాంక చోప్రాకు కజిన్. పరిణీతి లండన్ మ్యాంచెస్టర్ బిజినెస్ స్కూల్ నుంచి బిజినెస్, ఫైనాన్స్ మరియు ఎకనామిక్స్ విభాగాలలో ట్రిపుల్ హానర్స్ డిగ్రీని పొందారు. లండన్‌లో ఆమె ఆర్థిక రంగంలో ఉద్యోగం కూడా చేశారు. పరిణీతి నటనపై ఆసక్తి చూపడంతో 2011లో "లేడీస్ వర్సెస్ రికీ బెహ్ల్" అనే చిత్రంలో సహాయ నటిగా అవకాశం లభించింది. ఈ చిత్రంలో ఆమె నటనకు మంచి గుర్తింపు లభించింది, దీనితో ఆమెకు ఉత్తమ నూతన నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. పరిణీతి ఒక మంచి గాయని కూడా. ఆమె మేరి ప్యారీ బిందు సినిమాలో "మాన కే హమ్ యార్ నహీ" అనే పాటను పాడారు. ఈ పాట చాలా హిట్ అయింది.