Jared Leto: 9 మంది మహిళలపై ఆస్కార్ విన్నర్ లైంగిక దాడి.. మైనర్లను కూడా వదలకుండా!

ఆస్కార్ విజేత జారెడ్ లెటోపై తొమ్మిది మహిళలు లైంగిక ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో 16 ఏళ్ల మైనర్ బాలిక కూడా ఉన్నట్లు తెలిసింది. అయితే లెటో ప్రతినిధి మాత్రం ఈ ఆరోపణలన్నింటినీ తీవ్రంగా ఖండించారు. లెటో 'డల్లాస్ బయ్యర్స్ క్లబ్' మూవీకి ఆస్కార్ గెలుచుకున్నాడు.

New Update
Oscar Winner Jared Leto

Oscar Winner Jared Leto

Jared Leto: ఆస్కార్ విజేత నటుడు జారెడ్ లెటోపై తొమ్మిది మంది మహిళలు లైంగిక ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలు చేసిన వారిలో కొందరు మైనర్లు కూడా ఉన్నారని తెలుస్తుంది.  ఎయిర్‌మెయిల్ నివేదిక తెలిపిన వివరాల ప్రకారం.. లెటో  పై 16 ఏళ్ల అమ్మాయిని లైంగిక ప్రశ్నలు అడిగాడని ,  17 ఏళ్ల అమ్మాయి ముందు  తనను తాను నగ్నంగా చూపించుకోవడం,  18 ఏళ్ల అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలు ఉన్నాయి. 

మహిళల ఆరోపణలు 

ఒక మోడల్ తాను 16 ఏళ్లప్పుడు లెటో తనతో స్టూడియోలో అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపించింది.  మరో మహిళ 16 ఏళ్లప్పుడు లెటో తనను లాస్ ఏంజిల్స్ కేఫ్‌లో కలిశాడని, ఆ తర్వాత రాత్రిపూట విచిత్రమైన గొంతుతో ఫోన్ చేశాడని చెప్పింది. పార్టీకి రావడానికి నిరాకరించినా, వారాల తరబడి ఫోన్ చేసి లైంగికంగా సంభాషించాడని ఆరోపించింది. 

ఇంకో మహిళ, తాను మైనర్‌గా ఉన్నప్పుడు అసౌకర్య ప్రశ్నలు అడిగి వేధించాడని , 18 ఏళ్లు రాగానే తన ముందు అశ్లీలంగా ప్రవర్తించి బలవంతం చేశాడని పేర్కొంది. అంతేకాదు జారెడ్ లెటో  తన పార్టీల్లో మైనర్లు స్కిన్నీ-డిప్ చేసేవారని కూడా ఆరోపించింది. లెటో పై ఒకేసారి వేర్వేరు మహిళలు ఒకే విధమైన ఆరోపణలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. గత నెలలో ఒక DJగా పనిచేస్తున్న ఓ మహిళ.. తాను  17 ఏళ్ళు ఉన్నప్పుడు  లెటో తనతో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించిన తర్వాత.. ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

అన్నీ అబద్దాలే 

మరోవైపు లెటో ప్రతినిధి మాత్రం  ఈ ఆరోపణలన్నింటినీ లెటో  తీవ్రంగా ఖండించారు. ఎటువంటి "తప్పు" జరగలేదని అన్నారు. గత నెలలో ఒక DJ, తను 17 ఏళ్లప్పుడు లెటో అనుచితంగా ప్రవర్తించాడని ఆరోపించిన తర్వాత ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.  లెటో 'డల్లాస్ బయ్యర్స్ క్లబ్' సినిమాలో నటనకు ఆస్కార్, గోల్డెన్ గ్లోబ్ గెలుచుకున్నారు. నెక్స్ట్ 'ట్రాన్ ఏరిస్' సినిమాలో కనిపించనున్నారు. ఈ చిత్రం  అక్టోబర్ 10, 2025న విడుదల కానుంది. .

Advertisment
తాజా కథనాలు