OG Hungry Cheetah: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' నుంచి హంగ్రీ చీతా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది. మాస్ బీట్ ర్యాప్ స్టైల్ తో కూడిన ఈ యాక్షన్ ఓరియెంటెడ్ థీమ్ సాంగ్ పవన్ ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అందిస్తోంది. ఈ పాట పవన్ కళ్యాణ్ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఇంటెన్సిటీ, పవర్ ని చూపిస్తోంది. తమన్ పవర్ ప్యాక్డ్ ఎనర్జిటిక్ మ్యూజిక్ అభిమానులకు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. 'నెత్తురుకు మరిగిన హంగ్రీ చీతా.. శత్రువును ఎంచితే మొదలు వేట, డెత్ కోటా కన్ఫిర్మ్ అంట వంటి లైన్స్ పాత్రలోని పవర్ ని సూచిస్తున్నాయి.
అత్యధిక వసూళ్లు
గతనెల థియేటర్స్ లో విడుదలైన 'ఓజీ' సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తొలి రోజు నుంచే భారీ వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపింది. విడుదలైన 28 రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 310 కోట్లకి పైగా వసూళ్లు సాధించింది. ఇది పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.
Mumbai Vasthunna…. Thalalu Jagratta 🔥#OG on @NetflixIndia from Oct 23rd…#TheyCallHimOGpic.twitter.com/BerySBkJ4y
— DVV Entertainment (@DVVMovies) October 18, 2025
సక్సెస్ ఫుల్ థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలోనే ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు రాబోతుంది. అక్టోబర్ 23 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. DVV ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై దానయ్య భారీ బడ్జెట్ తో ఈ సినిమాను DVV నిర్మించారు. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్‌గా ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించారు. నేహా శెట్టి, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి, అర్జున్ దాస్, హరిష్ ఉతమన్, సుధేవ్ నాయర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
Also Read: Chings Add: వామ్మో.. రూ. 150 కోట్లతో యాడ్ షూటా! అట్లీ డైరెక్షన్ లో శ్రీలీల, రణ్‌వీర్ సింగ్!
Follow Us