OG Fire Strome: ‘ఓజీ’ ఫైర్‌స్ట్రోమ్ రివ్యూ.. థమన్ మాస్ మ్యూజిక్, పవన్ కల్యాణ్ స్వాగ్ ఎలా ఉందంటే?

పవన్ కల్యాణ్ 'OG' నుంచి ఫస్ట్ సింగిల్ విడుదలైంది. ఈ సాంగ్ మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సంగీత దర్శకుడు థమన్ అద్భుతంగా స్వరపరిచాడు. పవన్ కల్యాణ్ స్టైల్‌, స్వాగ్‌కు తగ్గట్లుగా ఈ పాటను థమన్ డిజైన్ చేయడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.

New Update

పవన్ కల్యాణ్ నటిస్తున్న మాస్ యాక్షన్ గ్యాంగ్ స్టర్ చిత్రం ‘OG’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు. ఈ క్రమంలో మేకర్స్ అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్‌ను రిలీజ్ చేశారు. ‘OG Fire Strome’ అంటూ రిలీజ్ అయిన ఈ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. 

OG Fire Strome

మాస్ ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ మొదటి పాటను తమిళ స్టార్ హీరో, సింగర్ శింబు పాడగా.. తమన్ మ్యూజిక్ అందించాడు. శింబుతో పాటు తమన్, దీపక్, నజీరుద్దీన్, భరత్ రాజ్, రాజకుమారి కూడా కలిసి పాడటం విశేషం. పవర్ స్టార్ స్టైల్‌, స్వాగ్‌కు తగ్గట్లుగా ఈ సాంగ్‌ను థమన్ డిజైన్ చేయడంతో అభిమానులు ఆనందానికి అవధుల్లేవనే చెప్పాలి. ఈ సాంగ్‌తో తెగ పండగ చేసుకుంటున్నారు. 

మరీ ముఖ్యంగా ఈ సాంగ్‌లో పవన్ స్టైల్, యాటిట్యూడ్‌ను ఎలివేట్ చేసే బీట్స్, హై-ఓల్టేజ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నాయి. థమన్ మరోసారి తన మార్క్ మ్యూజిక్‌తో అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపు చేశాడు. సాంగ్‌లో వచ్చే ప్రతి బీట్ పవన్ కల్యాణ్ ఎంట్రీని, ఆయన పాత్రలోని పవర్‌ను ఓ రేంజ్‌లో ఎలివేట్ చేస్తుంది.

ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి పవన్ కల్యాణ్ ఇందులో ఒక పవర్ ఫుల్ గ్యాంగ్ స్టర్‌గా కనిపించబోతున్నాడు అని వార్తలు చక్కర్లు కొట్టాయి. దానికి అనుగుణంగానే థమన్ అందించిన ఫస్ట్ సాంగ్ ఈ మూవీలోని కథకు ప్రాణం పోసిందని అభిమానులు మాట్లాడుకుంటున్నారు. సాంగ్‌లోని లిరిక్స్ కూడా పవన్ పవర్, ఆయన పాత్రకు ఉన్న ఇమేజ్‌ను అత్యద్భుతంగా చాటిచెబుతున్నాయి. ఇందులో పవన్ కల్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు.

ఈ పాట విడుదలైన కొద్ది గంటల్లోనే యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ప్రస్తుతం #OGFirstSingle, #PawanKalyan, #Thaman వంటి హ్యాష్‌ట్యాగ్‌లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ‘సాహో’ వంటి భారీ బడ్జెట్ చిత్రానికి దర్శకత్వం వహించిన సుజిత్.. ఇప్పుడు పవన్ కల్యాణ్‌తో ‘ఓజీ’ మూవీని డైరెక్ట్ చేస్తుండటంతో అంచనాలు పెరిగిపోయాయి. ఈ ఫస్ట్ సింగిల్ పాటతోనే సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ సినిమాలో పవన్ కల్యాణ్‌కు జోడీగా ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇందులో కీలక పాత్రల్లో శ్రియ రెడ్డి, ఇమ్రాన్ హష్మి నటిస్తున్నారు. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. 

Advertisment
తాజా కథనాలు