”వెట్రిమారన్ సర్ ప్లీజ్ నాతో సినిమా చేయండి”… NTR కామెంట్స్ వైరల్

'దేవర' ప్రమోషనల్ ఈవెంట్ లో NTR కామెంట్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారాయి. తన ఫేవరేట్ డైరెక్టర్ వెట్రిమారన్ పిలిస్తే.. స్ట్రెయిట్ తమిళ్ ఫిల్మ్ చేయడానికి నేను సిద్ధం అంటూ తన కోరికను తెలిపారు. దీంతో తారక్ కోలీవుడ్ ఎంట్రీకి రెడీగా ఉన్నట్లు చెప్పకనే చెప్పినట్లు తెలుస్తోంది.

New Update
NTR-Vetrimaaran

NTR- Vetrimaaran:  టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా రూపొందిన ‘దేవర’ రెండు భాగాలుగా రాబోతుంది. పార్ట్ 1 ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ సహా పలు భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ చేస్తూ బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా తాజాగా ‘దేవర’ టీమ్ చెన్నైలో సందడి చేసింది. 

వెట్రిమారన్ తో సినిమా చేయాలని ఉంది

ఈ సందర్భంగా చెన్నె ప్రెస్ మీట్ లో తారక్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. తమిళ చిత్రం నటించే అవకాశం ఉందా అని ప్రశ్నించగా.. దానికి ఎన్టీఆర్ ఏ మాత్రం ఆలోచించకుండా.. వెట్రిమారన్ సర్ ప్లీజ్ నాతో సినిమా చేయండి.. స్ట్రెయిట్ తమిళ్ ఫిల్మ్ చేయడానికి నేను సిద్ధం అంటూ వెట్రిమారన్ తో సినిమా చేయాలనే తన కోరికను బయటపెట్టారు. మొత్తానికి తాను కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రెడీగా ఉన్నానని తన కామెంట్స్ ద్వారా చెప్పకనే చెప్పారు తారక్. ఇక తారక్ విజ్ఞప్తికి వెట్రిమారన్ రియాక్షన్ ఎలా ఉండబోతుందా.? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.

వెట్రిమారన్ సినిమాలోని పాత్రలు డైరెక్టర్ గా ఆయనను ప్రత్యేకంగా చూపిస్తాయి. ప్రేక్షకులతో పాటు, హీరోలు కూడా వెట్రిమారన్ సినిమాలకు ఫ్యాన్స్ అయిపోతుంటారు. ఆయన సినిమాల్లోని కథ, పాత్రలు అంతలా మ్యాజిక్ చేస్తాయి. విసరనై, ఆడుకలం వంటి చిత్రాలు జాతీయ అవార్డులు సొంతం చేసుకున్నాయి.

Advertisment
తాజా కథనాలు