NTR DRAGON: ఎన్టీఆర్ 'డ్రాగన్' కథలో అదిరిపోయే ట్విస్ట్.. ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా!

ఎన్టీఆర్ 'డ్రాగన్'   సినిమాకు సంబంధించిన  మరో  అప్డేట్ నెట్టింట వైరల్ గా మారింది. 'డ్రాగన్'  లో ఎన్టీఆర్ పాత్ర పై ఒక పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

New Update
NTR NEEL PROJECT

NTR NEEL PROJECT

NTR DRAGON:ప్రస్తుతం టాలీవుడ్ సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఎన్టీఆర్  'డ్రాగన్ ' ఒకటి. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్స్ అందించిన ప్రశాంత్ నీల్  ఈ సినిమాను తెరకెక్కిస్తుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాగా  'డ్రాగన్'  తీయాలనే  ప్లాన్ చేస్తున్నారట  ప్రశాంత్ నీల్. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించిన  మరో  అప్డేట్( NTR Dragon Updates ) నెట్టింట వైరల్ గా మారింది. 

పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్.. 

'డ్రాగన్'  లో ఎన్టీఆర్ పాత్ర పై ఒక పవర్ ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. సెకండ్ ఆఫ్ లో ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు ఎమోషనల్ సీక్వెన్సెస్ కూడా ఉంటాయట.. ఇందులో భాగంగానే ఎన్టీఆర్ పాత్ర పై ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని సమాచారం. దీని ప్రకారం.. ఈ సినిమాలో రెండు విభిన్నమైన కథాంశాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఒకటి ప్రస్తుతానికి సంబంధించిన కథ కాగా, మరొకటి ఫ్లాష్ బ్యాక్ కథ.  అయితే ఫ్లాష్ బ్యాక్ లో ఎన్టీఆర్ పాత్ర మాఫియా నేపథ్యంలో చాలా పవర్ ఫుల్ గా ఉంటుందట.  ఈ పాత్ర కోసం తారక్  తన శరీర ఆకృతి, బాడీ లాంగ్వేజ్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారట. 

ఇతర సినిమాల మాదిరిగా కాకుండా.. ఈ సినిమాలో  ఫ్లాష్ బ్యాక్ స్టోరీ బిన్నంగా ఉండబోతుందట. సాధారణంగా మిగతా సినిమాల్లో  ఫ్లాష్ బ్యాక్ అనేది కేవలం హీరోకు సంబంధించిన గతాన్ని  చూపించేదిగా ఉంటుంది. కానీ, ఇందులో కథ ప్రధానంగా ఉండబోతుందట. ఈ ఫ్లాష్ బ్యాక్ లోని కథే  ప్రధాన కథకు మూలమని తెలుస్తోంది. 

భారీ అంచనాలు 

RRR తర్వాత ఎన్టీఆర్ నుంచి వచ్చిన దేవర, వార్ 2 ఆశించిన స్థాయిలో సంతోష పెట్టలేకపోయాయి. దీంతో ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలు పెట్టుకున్నారు తారక్ ఫ్యాన్స్.  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్  సంగీతం అందిస్తున్నారు. 

ఎన్టీఆర్ ప్రాజెక్ట్ తో పాటు  ప్రభాస్  'సలార్ 2'  కూడా చేస్తున్నారు  ప్రశాంత్ నీల్. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, కల్కి షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో నీల్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పూర్తి చేసే పనిలో ఉన్నారు.  ఇప్పటికే తారక్  'డ్రాగన్' షూటింగ్ సగభాగం పూర్తయినట్లు సమాచారం.  

Also Read: Maldives Vacation: మాల్దీవ్స్ లో చిల్ అవుతున్న స్టార్ హీరోయిన్ .. ఫొటోలు చూశారా!

Advertisment
తాజా కథనాలు