NTR GYM Video: ఏమున్నాడ్రా బాబు.. జిమ్‌లో NTR హార్డ్ వర్కౌట్‌‌కి ఫ్యాన్స్ ఫిదా..

ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ చేసిన వర్కౌట్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. తీవ్రమైన కసరత్తులతో ఎన్టీఆర్ స్లిమ్, ఫిట్ లుక్‌లో కనిపిస్తున్నారు. అభిమానులు ఆయన అంకితభావానికి, కొత్త లుక్‌కు ఫిదా అవుతున్నారు.

New Update
NTR GYM Video

NTR GYM Video

ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ చిత్రం ‘ఎన్టీఆర్ 31’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రానికి ‘డ్రాగన్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘KGF’, ‘Salaar’ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన ప్రశాంత్ నీల్.. ‘RRR’ వంటి గ్లోబల్ హిట్ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ కలయికలో ఈ మూవీ వస్తుండటంతో అభిమానులు, ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలు ఉన్నాయి.

NTR GYM Video

ఈ సినిమా బడ్జెట్ విషయంలో రోజుకో సమాచారం బయటకొస్తోంది. ఇది ఎన్టీఆర్ కెరీర్లోనే అత్యంత ఖరీదైన సినిమా అని తెలుస్తోంది. ఈ సినిమా బడ్జెట్ సుమారు రూ.350 కోట్ల నుంచి రూ.360 కోట్ల వరకు ఉంటుందని అంచనా. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని ప్రశాంత్ నీల్ తన స్టైల్‌కు తగినట్టుగా భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాఫిక్స్ ఎక్కువగా ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. 

ఈ మూవీలో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే హీరోయిన్ గురించి ఇంకా ఎలాంటి అప్డేట్‌ లేదు. అలాగే ఇతర కీలక పాత్రల గురించి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే కొన్ని రూమర్స్ మాత్రం నెట్టింట వైరల్ అవుతున్నాయి. కన్నడ నటి రుక్మిణి వసంత్ ఇందులో ఎన్టీఆర్‌కు జోడీగా నటించే ఛాన్స్ ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. 

అంతేకాకుండా మలయాళ నటుడు టోవినో థామస్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే హైదరాబాద్‌లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. అందుకు సంబంధించిన పోస్టర్ కూడా ఆ మధ్య వైరల్‌గా మారింది. అయితే ఈ ప్రారంభ సన్నివేశంలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉందని, దీనికోసం సుమారు 3000 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారని వార్తలు వచ్చాయి. 

ఇలా ఈ సినిమాకు సంబంధించిన కొన్ని అప్డేట్‌లు అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన ఫ్యాన్స్‌కు మరొక సర్‌ప్రైజ్ అందించారు. ఎన్టీఆర్ జిమ్ వర్కౌట్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ‘డ్రాగన్’ కోసం ఎన్టీఆర్ భారీగా బరువు తగ్గి, స్లిమ్ లుక్‌లో కనిపించడానికి జిమ్‌లో గంటలు గంటలు కష్టపడుతున్నట్లు తెలుస్తోంది. వైరలవుతున్న వీడియోలో ఎన్టీఆర్ తన బాడీపై టీ షర్ట్ లేకుండా జిమ్ చేస్తున్నాడు. ఆ వీడియోలో ఆయన తీవ్రంగా కసరత్తులు చేస్తూ కనిపిస్తున్నారు. ఇది చూసిన అభిమానులు ఆయన అంకితభావానికి ఫిదా అవుతున్నారు. 

Advertisment
తాజా కథనాలు