Devara: 'దేవర' సినిమా చూస్తూ థియేటర్లో ఎన్టీఆర్ అభిమాని మృతి..!

కడప అప్సర థియేటర్లో విషాదం చోటుచేసుకుంది. థియేటర్లో 'దేవర' సినిమా చూస్తున్న ఎన్టీఆర్ అభిమాని విజిల్స్, కేకలు వేస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లుగా వైద్యులు తెలిపారు.

New Update

NTR Fan:  టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'దేవర'. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుగా అని భారీ అంచనాలతో ఎదురుచూస్తున్న ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌ గా విడుదలైంది. దాదాపు ఆరేళ్ళ తర్వాత తారక్ సోలోగా  వచ్చిన సినిమా కావడంతో థియేటర్స్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. తెరపై ఎన్టీఆర్ ను చూస్తూ విజిల్స్, కేకలు వేస్తూ హంగామా చేస్తున్నారు. 

'దేవర' చూస్తూ మృతి చెందిన NTR అభిమాని  

'దేవర'  రిలీజ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ పండగా చేసుకుంటున్న వేళ.. కడప జిల్లా అప్సర థియేటర్లో పెను విషాదం చోటు చేసుకుంది. థియేటర్లో 'దేవర' సినిమా  చూస్తున్న ఎన్టీఆర్ అభిమాని ఒక్కసారిగా కుప్పకూలిపోయి మృతిచెందాడు. అయితే కడప జిల్లాలో 'దేవర' రిలీజ్ సందర్భంగా  అప్సర థియేటర్లో అభిమానుల కోసం ఫ్యాన్స్ షో వేశారు. దీంతో సినిమా చూస్తున్న ఫ్యాన్స్ విజిల్స్, కేకలు వేస్తూ హంగామా చేస్తుండగా.. ఒక్కసారిగా ఓ అభిమాని కుప్పకూలిపోయాడు. వెంటనే అతడిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతి చెందిన ఎన్టీఆర్ అభిమానిని సీకే దీన్నే మండలం జమాల్ పల్లికి చెందిన మస్తాన్ వలిగా గుర్తించారు. 

#koratalasiva #devara #ntr
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి