NTR Devara 2: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా! దేవర 2 వచ్చేస్తోంది..

జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా విడుదలై సంవత్సరం పూర్తయిన సందర్భంగా మేకర్స్ అధికారికంగా దేవర 2ను ప్రకటించారు. మొదటి భాగం క్లిఫ్‌హ్యాంగర్‌ ముగింపుతో ముగియగా, పార్ట్ 2లో మరోసారి ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నాడు.

New Update
NTR Devara 2

NTR Devara 2

NTR Devara 2: యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన మాస్ యాక్షన్ డ్రామా ‘దేవర’ గత ఏడాది సెప్టెంబర్ 27న విడుదలై భారీ విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్‌లో తండ్రి దేవర, కొడుకు వరధ పాత్రల్లో ఆకట్టుకున్నారు. ఇప్పుడు, ఈ సినిమా విడుదలైన రోజు మొదటి వార్షికోత్సవం సందర్భంగా, మేకర్స్ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘దేవర 2’ రాబోతోందన్న వార్తతో అభిమానులు ఖుషీగా ఉన్నారు.

Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!

#DEVARA...

సోషల్ మీడియా వేదికగా చిత్ర బృందం, “ఒక సంవత్సరం పూర్తయింది... తీరాలపై ఆ గంభీరత మిగిలింది... ప్రపంచం గుర్తుంచుకునే పేరు #DEVARA... అది కలిగించిన భయం, ప్రేమ,  ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పుడు #Devara2కి సిద్ధమవ్వండి,” అంటూ పోస్టర్‌ను షేర్ చేశారు.

Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!

మొదటి భాగం చివరలో వచ్చిన క్లిఫ్‌హ్యాంగర్‌ సెక్వెన్స్‌ వచ్చే అవకాశం ఉందని అప్పుడే చెప్పింది. దర్శకుడు కొరటాల శివ, ఎన్టీఆర్ ఇద్దరూ గతంలోనే రెండవ భాగం గురించి హింట్ ఇచ్చారు. ఇప్పుడు అది అధికారికంగా నిర్ధారించడంతో, ప్రేక్షకుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.

Also Read:‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..

‘దేవర’తో జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్ తొలిసారి తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, శృతిమరాఠే, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్, కలైయరసన్, మురళీ శర్మ లాంటి నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించారు.

ఇప్పుడు ఎన్టీఆర్, వార్ 2 తర్వాత, మళ్లీ దేవర పాత్రలోకి రావడానికి సిద్ధమవుతున్నారు. రెండో భాగంలో మరింత మాస్ యాక్షన్, ఎమోషనల్ డ్రామాతో సినిమాను తెరకెక్కించనున్నారు.

Advertisment
తాజా కథనాలు