Nidhhi Agerwal : భీమవరం ఈవెంట్‌కు ప్రభుత్వ వాహనం... క్లారిటీ ఇచ్చిన నిధి!

ప్రముఖ నటి నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వ వాహనంలో ప్రయాణించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆమె ఒక ఆన్ గవర్నమెంట్ డ్యూటీ  స్టిక్కర్ ఉన్న వాహనంలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

New Update
nidhi

ప్రముఖ నటి నిధి అగర్వాల్ ఏపీ ప్రభుత్వ వాహనంలో ప్రయాణించడం వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఆమె ఒక ఆన్ గవర్నమెంట్ డ్యూటీ  స్టిక్కర్ ఉన్న వాహనంలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ప్రజలు కట్టే పన్నులతో నిర్వహించే ప్రభుత్వ వాహనాలను ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వచ్చిన నటి కోసం ఎలా ఉపయోగిస్తారంటూ ఆమెను  నెటిజన్లు, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

సోషల్ మీడియా వేదికగా క్లారిటీ

అయితే ఈ వివాదంపై తాజాగా సోషల్ మీడియా వేదికగా నిధి అగర్వాల్ స్పందించారు. భీమవరంలోని ఈవెంట్ ఆర్గనైజర్లే తనకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేశారని, ఆ వాహనం ప్రభుత్వానికి సంబంధించినదని తనకు తెలియదని తెలిపారు. అలాగే, ఆ వాహనాన్ని పంపమని తాను ఏ ప్రభుత్వ అధికారినీ కోరలేదని, ఈ వివాదానికి ప్రభుత్వ అధికారులకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. ఈవెంట్ నిర్వహణ కోసమే ఆర్గనైజర్లు ఆ వాహనాన్ని సమకూర్చారని ఆమె పేర్కొన్నారు. అయితే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని,  వీటిని అభిమానులు నమ్మవద్దని అన్నారు.  

 పవన్ కల్యాణ్ హీరోగా తెరకెక్కిన హరి హర వీరమల్లు చిత్రంలో  నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. ఇక ప్రభాస్ హీరోగా, మారుతి దర్శకత్వంలో రూపొందుతోన్న  ది రాజా సాబ్ చిత్రంలో కూడా నిధి హీరోయిన్ గా నటిస్తోంది.   ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ మూవీని త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు, మరికొన్ని ప్రాజెక్టులు కూడా చర్చల దశలో ఉన్నాయని సమాచారం.

Advertisment
తాజా కథనాలు