Jani Master: సుకుమార్ వల్లే..నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు..! జానీ మాస్టర్ కేసు వ్యవహారంలో ఫిల్మ్ ఛాంబర్ తీరుపై కూడా నిర్మాత నట్టి కుమార్ మండిపడ్డారు. ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిన తర్వాత ఎందుకు వెంటనే యాక్షన్ తీసుకోలేదని ప్రశ్నించారు. భరద్వాజ అనే వ్యక్తి కక్షతో కేసును వన్ సైడ్ చేశారని ఆరోపించారు. By Archana 22 Sep 2024 | నవీకరించబడింది పై 22 Sep 2024 18:02 IST in సినిమా Short News New Update Natti Kumar షేర్ చేయండి Natti Kumar: కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ వివాదం తెలుగు ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేకెత్తిస్తోంది. జానీ మాస్టర్ కేసు వెనుక రకరకాల వాదనలు వినిపిస్తుండగా.. కావాలనే కుట్ర చేసి జానీని ఇరిక్కించారనే వాదన కూడా వినిపిస్తోంది. జానీ భార్య అయేషా కూడా తన భర్త అరెస్టు వెనుక పెద్ద కుట్ర ఉందని నేరుగా మీడియా ముందే ఆరోపించారు. అంతే కాదు పలువురు సినీ నిర్మాతలు కూడా జానీ కేసు వెనుక పెద్ద నిర్మాతల హస్తం ఉందనే వాదన వినిపిస్తున్నారు. RTV తో నట్టి కుమార్ తాజాగా ఆర్టీవీ ఇంటర్వ్యూ లో పాల్గొన్న ప్రొడ్యూసర్ నట్టి కుమార్ జానీ కేసుకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. బాధిత మహిళా కొరియోగ్రాఫర్ డైరెక్టర్ సుకుమార్ చెప్పడం వల్లే ఫిల్మ్ ఛాంబర్ పెద్దలను సంప్రదించిందని తెలిపారు. పుష్ప 2 షూటింగ్ సమయంలో ఆ అమ్మాయి తన సమస్యను సుకుమార్ తో చెప్పిందని. దాంతో సుకుమార్ ఆ అమ్మాయిని ఒకసారి ఫిల్మ్ ఛాంబర్ లో తన కంప్లైంట్ రైజ్ చేయమని చెప్పినట్లు నట్టి వివరించారు. అలాగే ఫిల్మ్ ఛాంబర్ తీరుపై కూడా మండి పడ్డారు. ఇదంతా జానీ మాస్టర్ పై కోపంతోనే జరిగిందని సంచలన వ్యాఖ్యలు చేశారు నట్టి. ఆ అమ్మాయి కంప్లైంట్ చేసిన తర్వాత ఎందుకు వెంటనే యాక్షన్ తీసుకోలేదు.? పోలీసు కేసు అవ్వగానే ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం ఏంటి..? పూర్తి ఇన్వెస్టిగేషన్ జరగకుండానే ప్రెస్ మీట్ పెట్టి రిపోర్ట్ ఎందుకు బయట పెట్టారని వాదించారు. విచారణకు ముందే అతన్ని దోషిగా చేసి అతని అతన్ని ప్రెసిడెంట్ పదవి నుంచి సస్పెండ్ చేయడం వన్ సైడ్ మాత్రమే అవుతుంది. చేస్తే ఇద్దరి కార్డులు సస్పెండ్ చేయాలి.. కానీ, ఒకరిది మాత్రమే చేయడం ఏంటి? అసలు పబ్లిక్ చేయకుండా సబ్మిట్ చేయాల్సిన రిపోర్టును.. అందరి ముందు బయటపెట్టి.. భరద్వాజ అనే వ్యక్తి కక్షతో కేసును వన్ సైడ్ చేశారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. Also Read: Jani Mater: తన డ్యాన్స్‌తో టాలీవుడ్‌ను ఊపేసిన జానీ మాస్టర్‌ను కిందపడేసిన స్టెప్ ఇదే..! మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి