Nani Paradise: 'ధగడ్' ఆగాయా'.. 'ప్యారడైజ్' సెట్స్ లో అడుగుపెట్టిన నాని

నేచురల్ స్టార్ నాని- శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' కొత్త షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ లో 40 రోజుల పాటు జరగనున్న ఈ భారీ షెడ్యూల్ లో  హీరో నాని తాజాగా జాయిన్ అయ్యారు.  

New Update

Nani Paradise: నేచురల్ స్టార్ నాని- శ్రీకాంత్ ఓదెల 'ది ప్యారడైజ్' కొత్త షెడ్యూల్ మొదలైంది. హైదరాబాద్ లో 40 రోజుల పాటు జరగనున్న ఈ భారీ షెడ్యూల్ లో  హీరో నాని తాజాగా జాయిన్ అయ్యారు.  జూన్ 21న ఈ షూటింగ్ మొదలవ్వగా, నాని శనివారం  సెట్‌లో జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. 'ధగడ్' ఆగాయా' అంటూ పోస్టర్ ను షేర్ చేశారు. ఇందులో నాని వెయిట్ లిఫ్టింగ్ రింగ్స్ పై ఆకుపచ్చ లెదర్ షూస్ తో కాలు పెట్టుకొని కనిపించారు. అయితే నాని ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. ఇప్పటికే ఈ షెడ్యూల్ లో నాని చిన్నప్పటికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఇప్పుడు నాని సెట్స్ లో జాయిన్ అవడంతో.. నెక్స్ట్ 40 రోజుల పాటు పలు కీలక సన్నివేశాల చిత్రీకరణ జరగనుంది. 

Also Read: Shafali Jariwala: 15 ఏళ్ల వయసులోనే ఆ వ్యాధి.. 42 ఏళ్లకు మృతి! షెఫాలీ బ్యాక్ గ్రౌండ్ ఇదే

మాస్, రగ్గడ్ లుక్

దసరా' తర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబోలో  వస్తున్న రెండవ సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన గ్లిమ్ప్స్ వీడియోతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. నాని మాస్, రగ్గడ్ లుక్ లో కొత్తగా కనిపించారు. ఇందులో నాని మునుపెన్నడూ చేయని ఒక డిఫరెంట్ రోల్లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. SLV బైనార్ పై సుధాకర చెరుకూరి  ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు.

'ది ప్యారడైజ్' మార్చి  26, 2026న పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు.  తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్, స్పానిష్ 8 పైగా  భాషల్లో  విడుదల కానుంది.  నాని కెరీర్‌లోనే ఈ సినిమా  ఒక  మైలురాయిగా నిలవబోతుందని  సినీ వర్గాలు భావిస్తున్నాయి. 

Also Read: మా ప్రేమకు అడ్డొస్తే 55 ముక్కలు చేస్తా.. పబ్జీ ప్రియుడి కోసం భర్తకు మాస్ వార్నింగ్ ఇచ్చిన భార్య

Advertisment
Advertisment
తాజా కథనాలు