/rtv/media/media_files/2025/10/08/nandamuri-tejashwini-pic-one-2025-10-08-16-55-38.png)
నందమూరి మరో వారసుడు మోక్షజ్ఞ సినీ రంగప్రవేశం గురించి కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో తెగ చర్చలు నడుస్తున్నాయి. గతేడాది ఆగస్టులో 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మతో మోక్షజ్ఞ తొలి సినిమా అనౌన్స్ చేయగా.. ఇప్పటివరకు దాని గురించి ఒక్క అప్డేట్ కూడా లేదు. దీంతో ఈ సినిమా పట్టాలెక్కకుండానే ఆగిపోయిందని టాక్.
/rtv/media/media_files/2025/10/08/nandamuri-tejashwini-pic-three-2025-10-08-16-55-38.png)
/rtv/media/media_files/2025/10/08/nandamuri-tejashwini-pic-two-2025-10-08-16-55-38.png)
ఇన్నాళ్లు నిర్మాతగా తెరవెనుక ఉన్న బాలయ్య చిన్న కూతురు నందమూరి తేజశ్విని ఇప్పుడు తెరపై కనిపించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆమె నటించింది సినిమాలో కాదు! ఒక జ్యువెలరీ యాడ్ లో అని తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/10/08/nandamuri-tejashwini-pic-four-2025-10-08-16-55-38.png)
ఈ యాడ్ షూట్ చిత్రీకరణ ఇప్పటికే పూర్తవగా.. త్వరలోనే అన్ని డిజిటల్ మాధ్యమాలలో విడుదల అవుతుందని సమాచారం.
/rtv/media/media_files/2025/10/08/nandamuri-tejashwini-pic-five-2025-10-08-16-55-38.png)
దీంతో బాలయ్య వారసుడు మోక్షజ్ఞ కంటే ముందు వారసురాలు తేజశ్విని తెరపై కనిపించబోతున్నారు.
/rtv/media/media_files/2025/10/08/nandamuri-tejashwini-pic-six-2025-10-08-16-55-38.png)
తేజస్వినికి ఇండస్ట్రీ కొత్తేమీ కాదు. ఆమె బాలకృష్ణ టాక్ షో 'అన్‌స్టాపబుల్' ద్వారా సినీ పరిశ్రమతో తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె బ్లాక్‌బస్టర్ సినిమా 'భగవంత్ కేసరి' కి కూడా పనిచేశారు. ప్రస్తుతం, ఆమె తన తండ్రి రాబోయే ప్రాజెక్ట్‌లకు సహ-నిర్మాతగా కూడా పనిచేస్తున్నారు.
/rtv/media/media_files/2025/10/08/nandamuri-tejashwini-pic-seven-2025-10-08-16-55-38.png)
అందరూ ఆమె నిర్మాణ రంగంలోనే ( తెర వెనుక) ఉంటారని అనుకున్నారు, కానీ అందరినీ ఆశ్చర్యపరుస్తూ తేజస్విని ఇప్పుడు తెరపైకి వచ్చారు.