బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్.. 'డాకు మహారాజ్' గురించి అదిరే అప్డేట్!

బాలయ్య 'డాకు మహారాజ్' 2025 జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక అనౌన్స్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 4న టెక్సాస్‌లోని డల్లాస్‌లో నిర్వహించనున్నట్లు పోస్టర్ రిలీజ్ చేశారు.

New Update

అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్... 

ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ 'డాకు మహారాజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి అదిరే అప్డేట్ ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ యూఎస్ లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జనవరి 4న సాయంత్రం 6PM నుంచి ఈవెంట్ ప్రారంభం కానున్నట్లు తెలియజేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ , సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య సరసన  బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్‌ ఫీమేల్ లీడ్స్ గా నటిస్తున్నారు. బాబీ డియోల్ విలన్ గా.. ప్రగ్యా, చాందిని మరో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

బాలయ్య వరుస విజయాలతో ఊపు మీదున్నారు. గతేడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి, దసరాకు భగవంత్ కేసరి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు. అదే జోష్ తో హిట్ కొట్టబోతున్నట్లు తెలుస్తోంది. 

Also Read: 'నాకు అబ్బాయి పుడితే అలా చేస్తా'.. పిల్లల గురించి నాగచైతన్య కామెంట్స్ వైరల్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు