'నాకు అబ్బాయి పుడితే అలా చేస్తా'.. పిల్లల గురించి నాగచైతన్య కామెంట్స్ వైరల్!

ఇటీవలే రానా టాక్ షోలో పాల్గొన్న నాగచైత్యన్య సినీ కెరీర్, ఫ్యామిలీ, పిల్లలకు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. రానా.. ముగ్గురు, నలుగురు పిల్లలు కావాలా..? అని అడగగా.. దానికి నాగచైతన్య ఒకరిద్దరు చాలు అంటూ బదులిచ్చారు.

New Update
Naga Chaitanya (1)

Naga Chaitanya

Naga Chaitanya: టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య ఇటీవలే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. నటి శోభితను వివాహం చేసుకున్నారు. డిసెంబర్ 4న కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య ఈ జంట వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే తాజాగా 'ది రానా ద‌గ్గుబాటి టాక్ షోలో'   పాల్గొన్న నాగచైత్యన్య సినీ కెరీర్ , ఫ్యామిలీ, పిల్లలకు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. 

ఇద్దరు పిల్లలు చాలు.. 

ఈ క్రమంలో హోస్ట్ రానా.. వెంకీమామలా ముగ్గురు, నలుగురు పిల్లలు కావాలా..? అని అడగగా.. దానికి నాగచైతన్య ఒకరిద్దరు చాలు అంటూ బదులిచ్చారు. అలాగే తనకు కొడుకు పుడితే వాడిని రేస్ ట్రాక్ కి తీసుకెళ్తానని.. అమ్మాయి పుడితే తన అభిరుచులను గుర్తించి వాటిని ప్రోత్సహిస్తాని తెలిపారు. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలని ఉందని. చిన్నప్పుడు పిల్లలుగా తాము ఎంజాయ్ చేసిన క్షణాలను మళ్ళీ వాళ్ళతో కలిసి ఆస్వాదించాలని ఉంది అంటూ నాగచైతన్య ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

నాగచైతన్య ప్రస్తుతం చందు మొండేటి దర్శకత్వంలో 'తండేల్' సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న విడుదల కానుంది. మత్స్య కారుల కథనంతో.. శ్రీకాకుళంలో జరిగిన యదార్థ సంఘటనలు ఆధారంగా ఈ మూవీ రూపొందుతోంది. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన 'బుజ్జి తల్లి' మిలియన్ల వ్యూస్ తో ట్రెండింగ్ లో ఉంది.  

Also Read: ఇదెక్కడి వింతరా బాబు.. బంగారు నగలతో పిల్లికి శ్రీమంతం.. మామూలుగా లేదుగా!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు