/rtv/media/media_files/2025/09/18/king-100-update-2025-09-18-13-10-37.jpg)
king 100 update
KING 100: టాలీవుడ్ కింగ్ నాగార్జున ఆరు పదుల వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీగా వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. ఇటీవలే కుబేర, కూలీ సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్నారు. 40 ఏళ్ళ సినీ కెరీర్లో 90 కి పైగా చిత్రాలతో అలరించిన కింగ్ నాగ్ ఇప్పుడు తన 100వ సినిమా కోసం సిద్ధమవుతున్నారు. #King100 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే దీనిని నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ప్రకటిస్తారని అభిమానులు ఆశపడ్డారు. కానీ, అదే సమయంలో 'కూలీ' థియేటర్స్ లో విడుదలవడం, బిగ్ బాస్ సీజన్ 9 ప్రారంభించడంలో నాగార్జున బిజీగా ఉన్నారు. దీంతో సినిమాను అనౌన్స్ చేయడం కుదరలేదు.
నాగచైతన్య- అఖిల్ క్యామియో
అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. కింగ్ 100వ సినిమాలో ఆయన కుమారులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ కూడా అతిథి పాత్రల్లో కనిపించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఒకవేళ ఇదే నిజమైతే అక్కినేని అభిమానులకు పెద్ద ట్రీట్‌గా మారే అవకాశం ఉంది. 'కింగ్ 100' ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. త్వరలోనే సెట్స్ పైకి కూడా వెళ్లనున్నట్లు సమాచారం.
#King100 film will be with @Rakarthik_dir (NithamOruVaanam) who is Tamil Director. It's a very grand film, we are starting this film soon, as #Coolie released.pic.twitter.com/CLIdhTee0E
— Ramesh Bala (@rameshlaus) August 19, 2025
It's a nice action, Family, Drama film. It'll be my next release" @iamnagarjuna…
తమిళ దర్శకుడు రా కార్తీక్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో కార్తిక్ తెరకెక్కించిన 'నితమ్ ఒరు వానం' (తెలుగులో 'ఆకాశం') పెద్దగా విజయం సాధించకపోయినా.. ఆయనతో సినిమా చేయడానికి రెడీ అయ్యారు కింగ్. అయితే కార్తీక్ కథ చెప్పిన విధానం, స్క్రిప్ట్ నాగార్జునకు బాగా నచ్చాయట. దీంతో గత ఆరు నెలలుగా ఈ స్క్రిప్ట్ కి మెరుగులు దిద్దే పనిలో ఉన్నారట డైరెక్టర్.
నాగార్జున సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తైతే దసరా సందర్భంగా సినిమాను లాంచ్ చేసే ప్లాన్ లో ఉన్నారట నాగార్జున. లాంచ్ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్ ముఖ్య అతిథిలుగా హాజరు కానున్నట్లు సమాచారం. అంతేకాదు చిరంజీవి చేతులతో సినిమాకు క్లాప్ కొట్టించాలని భావిస్తున్నారట నాగార్జున. ఫ్యామిలీ సెంటిమెంట్ ప్లస్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరక్కెక్కిస్తున్నారట డైరెక్టర్ కార్తీక్. ఇదిలా ఉంటే నాగార్జున సోలో హిట్ ఇచ్చి చాలా కాలం అయ్యింది. దీంతో ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అక్కినేని అభిమానులు.