Bad Boy Karthik: 'బ్యాడ్ బాయ్ కార్తీక్' వచ్చేశాడు.. నాగ శౌర్య కొత్త సినిమా టీజర్ అదిరింది!

నాగ శౌర్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్  యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'బ్యాడ్ బాయ్ కార్తీక్' టీజర్ విడుదల చేశారు మేకర్స్. శౌర్య యాక్షన్ విజువల్స్, లుక్స్ తో టీజర్ ఆకట్టుకుంటోంది.

New Update

డెబ్యూ డైరెక్టర్ 

డైరెక్టర్ రమేష్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సముద్రఖని , సాయికుమార్,  నరేష్ విజయకృష్ణ, పూర్ణ, వెన్నెల కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.  హారిస్ జైరాజ్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. చాలా కాలం తర్వాత హరీష్ మళ్ళీ తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  హరీష్ సంగీతంలో ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన  'నా మావ పిల్లను ఇస్తానన్నాడే', 'అమెరికా నుంచి వచ్చాను'  సాంగ్స్  మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్నాయి. 

ఇప్పటివరకు లవ్ స్టోరీస్, యూత్ ఫుల్ ఎంటర్ టైనర్స్ తో అలరించిన నాగ శౌర్య ఇప్పుడు.. పక్క మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.  టీజర్ లో శౌర్య ఇంటెన్స్ యాక్షన్, మాస్ డైలాగ్స్, రఫ్ లుక్స్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ చివరి  దశలో ఉంది. దీంతో మూవీ ప్రమోషన్స్ మొదలు పెట్టారు. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు. 

Also Read: Bigg Boss Promo: రేలంగి మావయ్య బయటకొచ్చాడు.. భరణికి ఇచ్చి పడేసిన శ్రీజ..! హై వోల్టేజ్ ఎపిసోడ్

Advertisment
తాజా కథనాలు