ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ హ్యాక్ అవుతున్న విషయం తెలిసిందే. మొన్నామధ్య కోలీవుడ్ హీరోయిన్ నయనతార ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమెనే తెలిపింది. తన పేరుతో వచ్చే పోస్టులకు ఎలాంటి రిప్లైలు ఇవ్వొద్దని చెప్పింది. ఇక తాజాగా అక్కినేని హీరో నాగ చైతన్య ఎక్స్ అకౌంట్ కూడా హ్యాక్ అయినట్లు తెలుస్తోంది.
కొన్ని నిమిషాల క్రితం నాగ చైతన్య ఎక్స్ ఖాతా నుంచి ఒక పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్‌లో..' నేను 2013లో 50 అమెరికన్ డాలర్లు పెట్టి 100 బిట్ కాయిన్లు కొన్నాను. ఇప్పుడు వాటి విలువ 6 మిలియన్లు డాలర్లు అయ్యింది. ఇవి ఎవరికైన బహుమతి ఇవ్వడం గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఓటు వేయండి..' అని ఉంది. ఈ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ చైతూ అకౌంట్ ను ఎవరో హ్యాక్ చేశారని గుర్తించారు.
Also Read : వినాయక్ తో ప్రభాస్.. డైరెక్టర్ లుక్ చూసి షాకవుతున్న నెటిజన్స్
ఆయన అకౌంట్ నుంచి ఇలాంటి పోస్ట్ ఎప్పుడూ చూడలేదని, కచ్చితంగా ఎవరో హ్యాక్ చేసి ఆయన అకౌంట్ నుంచి ఇలాంటి పోస్టులు పెడుతున్నారని అంటున్నారు. మరి నిజంగా చైతూ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిందా? లేక అతనే ఈ పోస్ట్ పెట్టాడా? అనేది తెలియాలంటే చై.. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందే.
'తండేల్' షూటింగ్ తో బిజీ..
నాగ చైతన్య ప్రస్తుతం 'తండేల్’ మూవీ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. చందూ మొండేటి డైరెక్ట్ చేసున్న ఈ మూవీలో సాయి పల్లవి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా సాగుతోంది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.