/rtv/media/media_files/2025/11/16/shiva-4k-2025-11-16-18-04-48.jpg)
Shiva 4k Collections
Shiva 4k Collections: అక్కినేని నాగార్జున(Nagarjuna) నటించిన సూపర్ హిట్ సినిమా ‘శివ’ ఇప్పుడు 4K రీమాస్టర్ వెర్షన్‌లో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma). సినిమాలో అమల అక్కినేని హీరోయిన్‌గా నటించారు. రీమాస్టరింగ్, ప్రొడక్షన్ పనులు అన్నపూర్ణ స్టూడియోస్ చేపట్టింది. అలాగే, సంగీతం ఇలైయారాజా గారు అందించారు.
ఈ రీమాస్టర్ వెర్షన్ 2 రోజుల బాక్సఫిస్ కలెక్షన్ డేటా అధికారికంగా రిలీజ్ చేసారు. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు రోజులలో సినిమా ₹3.95 కోట్లు సంపాదించింది. ఇందులో నార్త్ అమెరికా నుండి $50,000 కలిగింది.
నార్త్ అమెరికాలో సినిమా రికార్డులు అంచనాలకు మించి సాధించింది. కొన్ని మాత్రమే రీమాస్టర్ సినిమాలు అమెరికాలో $50,000 కంటే ఎక్కువ సంపాదించాయి. సీనియర్ హీరో నాగార్జునకి ఇది ఒక గొప్ప విజయంగా చెప్పవచ్చు.
‘శివ 4K’ మొత్తం రన్‌లో $15,000 కంటే ఎక్కువ కలెక్ట్ చేయనుందని అంచనా. మనదేశంలో దీన్ని రూపాయల్లో మార్చితే, అమెరికా నుండి 50 లక్షల పైగా కలెక్షన్స్ వచ్చినట్లే అవుతుంది. ఇది నిజంగా సూపర్ కలెక్షన్స్.
దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, హీరో నాగార్జున, మొత్తం టీమ్ 4K వెర్షన్‌కి చాలా శ్రద్ధతో పనిచేశారు. ప్రేక్షకుల స్పందనతో పాటు ఈ కలెక్షన్స్ వారిని చాలా ఫుల్ హ్యాపీ చేశాయనే చెప్పొచ్చు.
మొత్తానికి, శివ 4K రీమాస్టర్ విజయం సాధించి, నాగార్జున, టీమ్ కృషికి ఫలితంగా నిలిచింది. అమెరికా కలెక్షన్స్, భారతీయ ప్రేక్షకుల ఆదరణతో పాటు గ్లోబల్ ప్రేక్షకుల ప్రశంసలతో ‘శివ’ 4K మళ్ళీ హాట్ టాపిక్ అయ్యింది.
Follow Us