Thaman : 'గేమ్ ఛేంజర్' రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన థమన్..

మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'గేమ్ ఛేంజర్' సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పేశాడు. డిసెంబర్ 20న 'గేమ్‌ ఛేంజర్‌' విడుదల చేయబోతున్నారని, అలాగే సెప్టెంబర్ 25న గేమ్‌ ఛేంజర్‌ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఎక్స్ వేదికగా అనౌన్స్ చేశాడు.

author-image
By Anil Kumar
New Update

కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'గేమ్ ఛేంజర్' (Game Changer). సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమానుఅగ్ర నిర్మాత దిల్ రాజ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. నటి అంజలి మరో కీలక పాత్ర పోషిస్తుంది. 

ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి తరుణంలో మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఓ అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా సినిమా రిలీజ్ ఎప్పుడో చెప్పేశాడు. డిసెంబర్ 20న 'గేమ్‌ ఛేంజర్‌' విడుదల చేయబోతున్నారని, అలాగే సెప్టెంబర్ 25న గేమ్‌ ఛేంజర్‌ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశాడు.

Also Read :  లడ్డూ వివాదం.. పవన్ కళ్యాణ్ కు హీరో కార్తీ క్షమాపణలు, ట్వీట్ వైరల్

డిసెంబర్ 20 రచ్చ రచ్చే..

దీంతో థమన్ ట్వీట్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.' ఈ డిసెంబర్ 20 కి థియేటర్స్ లో రచ్చ రచ్చే' అంటూ నెట్టింట గేమ్ ఛేంజర్ హ్యాష్ ట్యాగ్ తో వరుస పోస్టులు పెడుతున్నారు. కాగా గేమ్ ఛేంజర్ రిలీజ్ ఇప్పటికే మూడు సార్లు  వాయిదా పడింది. ముందుగా ఈ సినిమాను 2024 సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, కుదరలేదు. 

Also Read : సెప్టెంబర్ 30 తర్వాత చూసుకుందాం.. పవన్ కు ప్రకాష్ రాజ్ వార్నింగ్

ఆ తరువాత సమ్మర్ అన్నారు.. అది కాస్త సెప్టెంబర్ కి మారింది.'భారతీయుడు 2' వల్ల  సెప్టెంబర్ రిలీజ్ కు నోచుకోలేదు. దీంతో ఎట్టకేలకు క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20 కి షిఫ్ట్ చేశారు. ఇప్పటిదాకా ఈ సినిమా నుంచి ఒకే ఒక్క సాంగ్ మాత్రమే రిలీజ్ చేశారు. వచ్చే నెల నుంచి వరుస అప్డేట్స్ రానున్నాయి. 

ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయెల్ రోల్ చేస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కథానాయికగా నటించగా.. నటి అంజలి మరో కీలక పాత్ర పోషిస్తుంది. అగ్ర నిర్మాత దిల్ రాజ్ సుమారు రూ.200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం అందించారు.

Also Read :  దసరా దావత్.. రూ.100కే గొర్రెపొట్టేలు, మేకపోతు, ఫుల్ బాటిల్స్!

#tollywood #ss-thaman #game-changer-movie
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి