Gopi sundar : మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ తల్లి కన్నుమూత

ప్రముఖ సంగీత దర్శకుడు గోపీ సుందర్ ఇంట విషాదం చోటుచేసుకుంది.  ఆయన తల్లి లివి సురేష్ బాబు(65) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కేరళలోని కుర్కెన్చెరీలోని తన అపార్ట్ మెంట్ లో తుదిశ్వాస విడిచారు.

New Update
gopi sundar

gopi sundar

ప్రముఖ సంగీత దర్శకుడు గోపీ సుందర్ ఇంట విషాదం చోటుచేసుకుంది.  ఆయన తల్లి లివి సురేష్ బాబు(65) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె కేరళలోని కుర్కెన్చెరీలోని  తన అపార్ట్ మెంట్ లో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని  గోపీ సుందర్ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. గోపీ సుందర్ తన బాధను వ్యక్తం చేస్తూ, తన తల్లిని ఓ మార్గదర్శిగా, తన జీవితంలో స్థిరమైన శక్తిగా అభివర్ణించారు. 

Also Read :  దొంగగా మారిన ఐటీ ఎంప్లాయ్.. కొలీగ్ ఇంటికి వెళ్లి అతని భార్యను..

Also Read :  15 ఏళ్లుగా లవ్.. విశాల్తో డేటింగ్.. పెళ్లిపై ఓపెన్ అయిన అభినయ!

అమ్మ.. నువ్వు నాకు జీవితాన్ని, ప్రేమను ఇచ్చావు. నా కలలను నిజం చేసుకునే ధైర్యాన్ని ఇచ్చావు. నేను క్రియేట్ చేసే ప్రతీ సంగీతం స్వరంలో నువ్వు నాపై చూపించిన ప్రేమే ఉంటుంది. నువ్వు వెళ్లిపోలేదు. నా మనసులో, మెలోడీస్‌లో, నేను వేసే ప్రతీ అడుగులో ఉన్నావు. నీ ఆత్మకు శాంతి చేకూరాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. కానీ నువ్వు నాతోనే ఉంటూ నన్ను చూస్తున్నావని నాకు తెలుసు. రెస్ట్ ఇన్ పీస్ అమ్మ. నువ్వు ఎప్పటికీ నా బలానివి. నాకు దారి చూపించే వెలుగువి అంటూ తన సోషల్ మీడియా పోస్టులో  గోపీ సుందర్ ఎమోషనల్ గా రాసుకొచ్చారు.  

గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వడూకర శ్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  గోపీ సుందర్ తల్లి మృతి పట్ల పలువురు సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని వెల్లడిస్తున్నారు.   తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీతాన్ని అందించిన గోపీ సుందర్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ లలో ఒకరిగా నిలిచారు.  

Also Read :  కుంభమేళాలో తొక్కిసలాట ఘటన.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు

Also Read : వీవీఐపీల పాస్‌ లు రద్దు..వాహనాలకు కూడా నో ఎంట్రీ..కుంభమేళాలో మార్పులు!

Advertisment
తాజా కథనాలు