/rtv/media/media_files/2025/08/22/mukesh-ambani-hospitalized-2025-08-22-15-00-30.jpg)
Mukesh Ambani hospitalized
BREAKING: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ , రిలయన్స్ ADA గ్రూప్ చీఫ్ అనిల్ అంబానీల తల్లి, కోకిలాబెన్ తీవ్ర అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. గురువారం రాత్రి ఆమెను ముంబైలోని HN రిలయన్స్ ఫౌండేషన్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం కాస్త విషమంగానే ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే కోకిలాబెన్ ని హెలికాప్టర్ అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించినట్లు పలు మీడియా కథనాలు చెబుతున్నాయి.
अंबानी परिवार की बढ़ी चिंता: अचानक बिगड़ी मुकेश अंबानी की मां Kokilaben Ambani की तबीयत, HN रिलायंस हॉस्पिटल में कराया गया भर्ती#MukeshAmbani#KokilabenAmbani#KokilabenAmbaniHNRelianceHospital#BollywoodNewspic.twitter.com/95ffEA9z9q
— Tadka Bollywood (@Onlinetadka) August 22, 2025
కుటుంబ సభ్యులంతా ఆస్పత్రికి
అయితే ఆమె ఆరోగ్యం గురించి అంబానీ కుటుంబం ఇప్పటివరకు ఎలాంటి అధికారికంగా ప్రకటన చేయలేదు. ముఖేష్ , అనిల్‌తో సహా అంబానీ కుటుంబం మొత్తం ముంబైలోని రిలయన్స్ ఆసుపత్రికి పరుగెత్తుకెళ్లిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా, ఇతర కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం తెలుసుకుని, నగరానికి తిరిగి వస్తూ కలీనా విమానాశ్రయంలో కనిపించిన విజువల్స్ కూడా వైరల్ అవుతున్నాయి.
కోకిలాబెన్ అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ భార్య, భారతదేశంలోని అత్యంత ధనవంతుడు ముకేష్ అంబానీకి తల్లి. గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఫిబ్రవరి 24, 1934న జన్మించిన ఆమె 1955 లో ధీరూభాయ్ అంబానీని వివాహం చేసుకున్నారు. ఆమెకు నలుగురు పిల్లలు ఉన్నారు. ముఖేష్, అనిల్, నీనా కొఠారి దీప్తి సాల్గాంకర్. ఇదిలా ఉంటే కోకిలాబెన్ అంబానీ కంప్లీట్ శాకాహారి ఆమె శ్రీనాథ్ జీని ఎక్కువగా ఆరాధిస్తారు. అలాగే ఆమెకు మెర్సిడెస్-బెంజ్ వంటి లగ్జరీ కార్లంటే చాలా ఇష్టం.