పెళ్లి కాకుండానే చంటి బిడ్డతో స్టార్ హీరోయిన్.. నెట్టింట ఫ్యాన్స్ రచ్చ

నటి మృణాల్ ఠాకూర్ చంటిబిడ్డను ముద్దాడుతూ షేర్ చేసిన పోస్ట్ చర్చనీయాంశమైంది. పెళ్లికిముందే బిడ్డను కన్నావా ఏంటి? అంటూ నెటిజన్స్ రచ్చ చేస్తున్నారు. 'ఎక్కడో తేడా కొడుతోంది. సీతకు సీమంతం ఎప్పుడో జరిగినట్లుంది. తండ్రి ఎవరో చెప్పేయ్' అంటూ ఆడేసుకుంటున్నారు. 

New Update
tk

Mrunal Thakur: యంగ్ బ్యూటీ, ‘సీతారామం’ ఫేమ్ మృణాల్ ఠాకూర్ మరోసారి నెట్టింట సందడి చేసింది. ఎల్లప్పుడూ తన అందం, అభినయంతో కుర్రాళ్లను కట్టిపడేసే భామ.. మరోసారి నెటిజన్ల మనసు దోచేసింది. ఈ మేరకు ఓ చిన్న పాపతో సరదాగా గడుపుతున్న ఫొటోను నెట్టింట షేర్ చేసింది. ఉయ్యాలలో పడుకున్న బుజ్జాయి తన పాదాలతో ఎదలపై తన్నుతుంటే మృణాల్ ఆనందంతో మురిసిపోయింది. అంతేకాదు ఆ ఆనంద క్షణాలకు తానెంతో పరవశించిపోయానంటూ ‘the shot that made you cry’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. 

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటో, పోస్ట్ వైరల్ అవుతుండగా నెటిజన్లనుంచి భిన్నమైన కామెంట్స్ వెలువడుతున్నాయి. పెళ్లికి ముందే పిల్లను కన్నావా ఏంటి అంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం 'ఎక్కడో తేడా కొడుతోంది. సీతకు సీమంతం ఎప్పుడో జరిగినట్లుంది. తండ్రి ఎవరో చెప్పేయ్' అంటూ రచ్చ చేస్తున్నారు. 

#mrinal-thakur
Advertisment
తాజా కథనాలు