Mrunal Thakur: పిల్లల్ని కనాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన మృణాల్

నటి మృణాల్ ఠాకూర్ ధనుష్ తో డేటింగ్ లో ఉన్నారంటూ వార్తలు వస్తుండగా, తాజాగా ఆమె చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలనేది తన చిన్ననాటి నుండి ఉన్న కల అంటూ మృణాల్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

New Update
Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur: సీతా రామంతో తెలుగు, తమిళ సినిమాల్లో మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న నటి మృణాళ్ ఠాకూర్ తాజాగా ఆమె ప్రేమ విషయంపై చేసిన వ్యాఖ్యలు, నెటిజన్లలో చర్చకు దారి తీశాయి. ఇటీవల ఆమె నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ‘కపిల్ శర్మ షో’కి హాజరైన మృణాల్, తనకు పెళ్లి పై ఉన్న ఆసక్తిని బహిరంగంగా వెల్లడించారు.

పెళ్లి నా చిన్నప్పటి కల (Mrunal Thakur Viral Comments)

షోలో, "ఒక నటుడిని పెళ్లి చేసుకోవాలా, లేక రాజకీయ నాయకుడిని పెళ్లిచేసుకోవాలా?" అనే ప్రశ్నపై చర్చ జరిగింది. కపిల్ శర్మ సరదాగా "పెళ్లి చేసుకోకపోవడమే మంచిది" అని అనగానే, మృణాల్ వెంటనే స్పందిస్తూ, "పెళ్లి నా చిన్నప్పటి కల. నాకు పిల్లలు కావాలి" అని చెప్పింది. ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Also Read: మృణాల్‌‌తో ధనుష్‌ డేటింగ్.. ఈ వీడియోతో మొత్తం బయటపడింది..!

అయితే తాజాగా మృణాల్ ఠాకూర్ ప్రముఖ తమిళ హీరో ధనుష్ తో డేటింగ్(Mrunal Thakur Dhanush Dating Rumours) చేస్తున్నారని పుకార్లు వస్తున్నాయి. మొదటగా ఈ వార్త Reddit వేదికగా బయటకి వచ్చింది. ఆ తర్వాత ఇద్దరూ ఒకే ఈవెంట్లలో వరుసగా కనిపించడంతో ఈ ఊహాగానాలకు బలం చేకూరింది.

ధనుష్ ముంబయికి వచ్చి మృణాల్ నటించిన ‘సన్ ఆఫ్ సర్దార్ 2’ ప్రీమియర్‌కు హాజరయ్యారు. అంతేకాక, ఆగస్టు 1న ఆమె పుట్టినరోజును కలిసి జరుపుకున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి. అంతకు ముందు, దర్శకుడు ఆనంద్ ఎలైరాయ్ బర్త్‌డే పార్టీలో కూడా వీరిద్దరూ కలిసి కనిపించారు. 

Also Read: సినిమా రివ్యూల పై నిప్పులు చెరిగిన మృణాల్ ఠాకూర్! ఫ్యాన్ తో చిట్ చాట్ వైరల్

ఇంకా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మృణాల్.. ధనుష్ చెల్లెలను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అవుతోంది. అలాగే ధనుష్ కుటుంబ సభ్యులు కూడా మృణాల్‌ను ఫాలో అవుతున్నారు, దింతో అభిమానులు వీరిద్దరూ త్వరలో ఒక్కటి కాబోతున్నారని చేర్చించుకుంటున్నారు.

అయితే ఇప్పటివరకు ధనుష్, మృణాల్ మాత్రం తమ రిలేషన్ పై స్పందించలేదు. అంత సీక్రెట్ గానే మైంటైన్ చేస్తున్నారు. కానీ, మృణాల్ పెళ్లి మీద చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో వీరి ప్రేమ గురించి ఊహాగానాలు మరింత బలంగా మారుతున్నాయి.

Advertisment
తాజా కథనాలు