బ్రదర్‌ ఇదేం బాలేదు.. అభిమాని చేసిన పనికి నటి స్ట్రాంగ్ కౌంటర్!

‘ది ఫ్యామిలీ స్టార్‌’ పోస్టర్ ఎడిట్ చేసిన అభిమానిపై మృణాల్‌ ఠాకూర్‌ అసహనం వ్యక్తం చేసింది. విజయ్‌ దేవరకొండ స్థానంలో అతని ఫొటో పెట్టి తనతో కలిసి టపాసులు కాలుస్తున్నట్లు క్రియేట్‌ చేయడం అస్సలు నచ్చలేదని చెప్పింది. ‘బ్రదర్ చెత్త పనులు మానుకో‘అని సూచించింది. 

author-image
By srinivas
New Update
erererere

Mrunal Thakur: నటి మృణాల్‌ ఠాకూర్‌ తన ఫొటో ఎడిటింగ్ పై అసహనం వ్యక్తం చేసింది. విజయ్ దేవర కొండ, మృణాల్‌ ఠాకూర్‌ జంటగా ‘ది ఫ్యామిలీ స్టార్‌’ మూవీలో నటించిన విషయం తెలిసిందే. కాగా ఈ సినిమా పోస్టర్ ఎడిట్ చేసి ఓ అభిమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ మేరకు విజయ్‌ దేవరకొండ స్థానంలో తన ఫొటోని పెట్టి.. మృణాల్‌తో కలిసి టపాసులు కాలుస్తున్నట్లు క్రియేట్‌ చేశాడు. ‘దీపావళి ఫొటో ఎడిటింగ్‌.. బాలీవుడ్‌ నటి ఫొటోషూట్‌’ అంటూ దానికి క్యాప్షన్ ఇచ్చాడు. ఇది కాస్త వైరల్ కావడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఏ మాత్రం నచ్చలేదు..

‘బ్రదర్ మీరు చేసిన పని నాకు ఏ మాత్రం నచ్చలేదు. ఇలా చేయడం భావ్యం కాదు. మీకు మీరే ఎందుకు తప్పుడు భరోసా ఇచ్చుకుంటున్నారు? మీరు చేసిన పని బాగుందనుకుంటున్నారా? ఇది ఏమాత్రం బాలేదు’ అంటూ కౌంటర్ ఇచ్చింది.  దీనిపై పలువురు నెటిజన్లు స్పందిస్తూ అతడి తీరుని తప్పుబడుతున్నారు. ఇక ‘ది ఫ్యామిలీ స్టార్‌’కు పరశురామ్‌ దర్శకత్వం వహించగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు దీనిని నిర్మించారు. 2024 ఏప్రిల్‌ 5న ఇది విడుదలై బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. 

Advertisment
తాజా కథనాలు