Mothers Day Special: అమ్మ ప్రేమ వెలకట్టలేనిది.. అయినప్పటికీ వారి ప్రేమ, త్యాగాలకు గుర్తుకు ఒకరోజును కేటాయిస్తూ మాతృ దినోత్సవం జరుపుకుంటారు. ప్రతి ఏడాది మే రెండవ ఆదివారం మదర్స్ డే సెలెబ్రేట్ చేసుకుంటారు. ఈ ప్రత్యేకమైన రోజున పిల్లలు తమ తల్లులకు గిఫ్ట్స్ అందించడం లేదా ఎక్కడికైనా తీసుకెళ్లి సర్ప్రైజ్ చేయడం చేస్తుంటారు. నిజజీవితంలోనే కాదు సినిమాల్లోనూ అమ్మ ప్రేమను వర్ణిస్తూ అనేక సూపర్ హిట్ పాటలు వచ్చాయి. ఇందులో అమ్మపై వచ్చిన కొన్ని బెస్ట్ పాటలను మీకోసం ఇక్కడ ఇస్తున్నాము.. చూసి ఎంజాయ్ చేయండి.
బెస్ట్ అమ్మ పాటలు
ప్రభాస్ హీరోగా నటించిన యోగి సినిమాలోని 'ఏ నోమునోచిందో' సాంగ్ వింటే ఇప్పటికీ ఎమోషనల్ అవుతారు. ఈ చిత్రం ప్రభాస్ తన తల్లి కోసం పడే బాధ అందరినీ కంటతడి పెట్టిస్తుంది.
ఎస్ వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన అభిషేకం సినిమాలోని 'నాలో నిను దాచుకుంటా' అంటూ సాగే అమ్మ పాట ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ పాటలోని సాహిత్యం అమ్మ ప్రేమను మనసుకు తట్టేలా చేస్తుంది.
రఘువరన్ బీటెక్ సినిమాలో 'అమ్మా అమ్మా' పాటను ప్రేక్షకులు ఇప్పటికీ వింటుంటారు.
రవితేజ, జయసుధ కాంబోలో వచ్చిన నీవే, నీవే సాంగ్ అప్పట్లో సూపర్ హిట్ చాట్ బస్టర్ గా నిలిచింది. ప్రతి ఒక్కరు తమ మదర్స్ బర్త్ డేలకు ఈ పాటనే పెట్టేవారు.
మెగాస్టార్ హిట్లర్ మూవీలో 'కన్నీలకే కష్టాలు' పాట కూడా ఎంతో ఎమోషనల్ గా సాగుతుంది.
telugu-news | latest-news | Mother’s Day 2025 | mothers day songs