ఆస్పత్రి నుంచి మోహన్ బాబు డిశ్చార్జ్.. ఆరోగ్యంపై వైద్యుల కీలక ప్రకటన

మంచు మోహన్ బాబు ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం రాత్రి జల్‌పల్లిలోని తన నివాసం వద్ద జరిగిన ఘర్షణ అనంతరం ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో జాయిన్ అయిన మోహన్ బాబు రెండు రోజుల చికిత్స అనంతరం ఇంటికి వచ్చారు.

New Update

Mohanbabu:  గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మోహన్ బాబు ఈరోజు డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం ఆయన ఇంటి దగ్గర జరిగిన ఘర్షణ తర్వాత మోహన్ బాబు ఒళ్ళు నొప్పులు, ఆందోళన వంటి ఆరోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరారు. ఆ తర్వాత ఆయనను పరీక్షించిన వైద్యులు కంటి దిగువభాగంలో గాయమైనట్లు గుర్తించామని తెలిపారు. అలాగే బీపీ ఎక్కువగా ఉందని,  గుండె కొట్టుకోవడంలో హెచ్చు తగ్గులు ఉన్నట్లు వెల్లడించారు. రెండు రోజుల పాటు  చికిత్స అనంతరం మోహన్ బాబు ఈరోజు ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలుస్తోంది. 

Also Read:46 ఏళ్ళ వయసులో కోయాక్టర్ ను పెళ్లి చేసుకున్న హీరో.. ఫొటోలు వైరల్!

సంచలనంగా మారిన వివాదం 

ఇది ఇలా ఉంటే.. మంచు ఫ్యామిలీలో వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. మొన్నటి వరకు నాలుగు గోడల మధ్య ఉన్న వీళ్ళ గొడవ..  ఇప్పుడు రచ్చకెక్కడం చర్చనీయాంశమైంది.  మంచు మనోజ్, తండ్రి మోహన్ బాబు ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. ఇంతటితో ఆగలేదు.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం.. మరో వైపు మోహన్ బాబు.. ప్రశ్నించేందుకు వచ్చిన మీడియా ప్రతినిధులపై చేయి చేసుకోవడం రచ్చ రచ్చగా మారింది.  

Also Read:రచ్చ లేపుతున్న మంచు ఫ్యామిలీ ఫైట్‌.. ముంబై పారిపోయిన మంచు లక్ష్మి!

Advertisment