Mithra Mandali OTT: థియేటర్లలో ఫట్టు.. OTTలో హిట్టు.. ట్రెండింగ్ లో "మిత్ర మండలి"..!

థియేటర్లలో ఫ్లాప్ అయిన ప్రియదర్శి, నిహారిక NM నటించిన “మిత్ర మండలి” సినిమా ఇప్పుడు ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతోంది. రీ-ఎడిట్ చేసిన వెర్షన్‌ OTTలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఇది ప్రైమ్ వీడియో ఇండియా టాప్ 5 ట్రెండింగ్ జాబితాలో ఉంది.

New Update
Mithra Mandali OTT

Mithra Mandali OTT

Mithra Mandali OTT: ఇటీవల టాలీవుడ్‌లో వచ్చిన కామెడీ డ్రామా “మిత్ర మండలి” (Mithra Mandali) థియేటర్లలో పెద్దగా సక్సెస్ సాధించలేకపోయింది. కానీ ఇప్పుడు అదే సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ట్రెండ్ అవుతోంది.

ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించిన వారు ప్రియదర్శి, సోషల్ మీడియాలో పేరు పొందిన నిహారిక NM. దర్శకుడు విజయేంద్ర ఎస్ ఈ సినిమాను తెరకెక్కించారు. సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకుల నుంచి, విమర్శకుల నుంచి చాలా నెగటివ్ రెస్పాస్ వచ్చినప్పటికీ. కథ, కామెడీ ట్రాక్, సన్నివేశాలు సరైన కనెక్షన్ లేకపోవడంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. సోషల్ మీడియాలో కూడా సినిమాపై ట్రోల్స్ విపరీతంగా జరిగాయి.

Also Read: SSMB29 తాజా అప్‌డేట్: 'గ్లోబ్ ట్రాటర్' నుంచి ప్రియాంక చోప్రా లుక్ వచ్చేస్తోంది..!

OTTలో మంచి వ్యూస్‌..

అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. థియేటర్లలో ఫెయిల్ అయిన ఈ సినిమా, OTTలో మాత్రం మంచి వ్యూస్‌ సాధిస్తోంది. ప్రైమ్ వీడియోలో ప్రస్తుతం ఇది ఇండియా టాప్ 5 ట్రెండింగ్ సినిమాల జాబితాలో ఐదవ స్థానంలో ఉంది.

Also Read: 'కే ర్యాంప్' ఎంటర్టైన్మెంట్..! ఇప్పుడు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే...?

సినిమా బృందం థియేటర్ వెర్షన్‌కి కాస్త మార్పులు చేసి, రీ-ఎడిట్ చేసిన వెర్షన్ను డిజిటల్‌గా రిలీజ్ చేసింది. కొన్ని సన్నివేశాలను తొలగించి, సినిమాను మరింత చక్కగా చూపించేలా తీర్చిదిద్దారని సమాచారం. దీంతో ప్రేక్షకులు ఇప్పుడు సినిమాను కొంత బాగానే ఎంజాయ్ చేస్తున్నారు.

Also Read: 'గ్లోబ్ ట్రాటర్' కోసం ఇద్దరు ప్రొడ్యూసర్స్.. పెద్ద ప్లానింగే ఇది..!

సప్త అశ్వ మీడియా వర్క్స్,  వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై ఈ సినిమాను కల్యాణ్ మంథినా, భాను ప్రతాప్, డా. విజయేందర్ రెడ్డి తేగల సంయుక్తంగా నిర్మించారు. సినిమాలో రాగ్ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరా కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది.

Also Read: 'SSMB 29' ఈవెంట్ కు భారీ సెటప్‌.. స్టేజ్ ఎంత పెద్దదో తెలిస్తే..!

ఇలా థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన “మిత్ర మండలి” ఇప్పుడు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లో హిట్ గా నిలుస్తోంది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలు కొన్నిసార్లు థియేటర్‌లో కాకుండా OTT ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి అనడానికి ఈ “మిత్ర మండలి” సినిమా ఉదాహరణగా నిలుస్తుంది. మొత్తం మీద, “మిత్ర మండలి” ఇప్పుడు OTTలో ప్రేక్షకులను నవ్విస్తూ, సెకండ్ ఇన్నింగ్స్‌లో విజయవంతంగా ఆడుతోంది.