/rtv/media/media_files/2025/08/20/mission-impossible-ott-2025-08-20-07-47-43.jpg)
Mission Impossible OTT
Mission Impossible OTT: టామ్ క్రూస్(Tom Cruise) నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ "మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్" ఇప్పుడు డిజిటల్ మార్కెట్లలో అందుబాటులో ఉంది. మీరు అమెజాన్ ప్రైమ్ వీడియో వంటి ప్లాట్‌ఫారాలపై ఈ సినిమాను కొనుగోలు చేసి చూడొచ్చు. ఇది 2023లో వచ్చిన "Dead Reckoning Part One" కు సీక్వెల్ గా వచ్చింది. ఇందులో ఏతాన్ హంట్ (టామ్ క్రూస్ పాత్ర) మళ్లీ ప్రపంచాన్ని రక్షించేందుకు ప్రాణాలు పెట్టి పోరాడతాడు - ఈసారి ఒక ప్రమాదకరమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ను ఆపడమే లక్ష్యంగా కథ సాగుతోంది.
ఈ సినిమాను IMAX ఫార్మాట్‌లో చిత్రికరించారు, అందుకే ఈ సినిమా ఆడియన్స్ కు మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ని ఇచ్చింది. అయితే ఇప్పుడు డిజిటల్‌గా విడుదల కావడంతో, ఇంట్లో కూర్చొని మొత్తం మిషన్: ఇంపాసిబుల్ సిరీస్‌ని చూసేయొచ్చు.
#MissionImpossible is now available as
— Cinema Mania (@ursniresh) August 20, 2025
RENT on Amazon Prime for Rs.119/-
In English, Hindi, Tamil & Telugu.#TomCruisepic.twitter.com/HuQFAlBpyA
ఫైనల్ రెకొనింగ్ సినిమా మే నెలలో "లిలో & స్టిచ్" లైవ్ యాక్షన్ రీమేక్ మూవీతో కలిసి రిలీజై బాక్సాఫీస్ రికార్డులు సృష్టించింది. ఇప్పటివరకు ఈ సినిమా అమెరికాలో దాదాపు 200 మిలియన్ డాలర్లు, ప్రపంచవ్యాప్తంగా 600 మిలియన్ డాలర్లకుపైగా వసూలు చేసింది. 2025లోని ఇతర సినిమాలతో హాలీవుడ్ మూవీస్ తో పోలిస్తే, ఈ సినిమా చాలా లేటుగా డిజిటల్ రిలీజ్ అయ్యింది.
Also Read: టామ్ క్రూజ్ 'మిషన్ ఇంపాజిబుల్ - ది ఫైనల్ రెకనింగ్': డిజిటల్ రిలీజ్ అప్పుడే..!
ఇక ఈ సినిమాకు సంబంధించిన ఫిల్మింగ్ కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టామ్ క్రూస్ నిజంగా భయం లేని నటుడు.ఎలాంటి యాక్షన్ సీన్స్ అయినా సొంతగా బాడీ డబల్ లేకుండా చేస్తాడు. ఈ సినిమాలో ఆయన చేసిన ప్యారషూట్ స్టంట్లు గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించాయి! ఆయన సినిమాల పట్ల ఉన్న డెడికేషన్ నిజంగా చాలా గొప్ప విషయం.
మిషన్: ఇంపాసిబుల్ సిరీస్‌కి ఇది ఆఖరి భాగమా?
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఇది ఫైనల్ మూవీగా ప్రచారం జరిగింది. ఇంకా మళ్లీ కొనసాగింపు ఉంటుందా? స్పిన్-ఆఫ్ ఉంటుందా? అనే విషయాల్లో ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
స్ట్రీమింగ్ & బ్లూ-రే..
ఈ చిత్రం త్వరలో Paramount+ లో స్ట్రీమింగ్‌కు రానుంది. అధికారిక తేదీ ఇంకా తెలియదు కానీ, అక్టోబర్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇక ఈ సినిమా అక్టోబర్ 14న 4K & బ్లూ-రే రూపంలో విడుదల కానుంది. ఇందులో డిలీటెడ్ సీన్లు, స్టంట్ల బీహైండ్-ది-సీన్స్ వీడియోలు, దర్శకుడు క్రిస్టోఫర్ మెక్‌క్వారీ, టామ్ క్రూస్ వ్యాఖ్యలతో కూడిన కామెంటరీ వంటివి ప్రత్యేక ఆకర్షణలుగా ఉండబోతున్నాయి.