New Update
1/8
2024 మిస్ యూనివర్స్ పోటీలు జైపూర్ వేదికగా అట్టహాసంగా జరిగాయి. ఈ ఏడాది మిస్ యూనివర్స్ ఇండియా కిరీటాన్ని గుజరాత్ కు చెందిన రియా సింఘా సొంతం చేసుకుంది. సెప్టెంబర్ 22న జరిగిన ఈ పోటీల్లో 51 మంది ఫైనలిస్టులు మిస్ యూనివర్స్ ఇండియా టైటిల్ కోసం పోటీ పడ్డారు.
2/8
2015 మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశీ రౌతేలా ఈ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. 2015 మిస్ యూనివర్స్ ఇండియా ఊర్వశీ రౌతేలా ఈ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు. విజేత రియాకు ఊర్వశీ కిరీటాన్ని మిస్ ఇండియా కిరీటాన్ని ధరింపజేశారు.
3/8
18 ఏళ్ల మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా రియా సింఘా గుజరాత్ లోని అహ్మదాబాద్ లో జన్మించింది. రీటా సింఘా, బ్రిజేష్ సింఘా రియా తల్లిదండ్రులు. టీన్ ఏజ్ లో గుజరాత్ GLS విశ్వవిద్యాలయానికి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న అందాల తార.
4/8
16 ఏళ్ళ వయసులోనే మోడలింగ్ మొదలు పెట్టిన రియా తొలినాళ్లలోనే దివాస్ మిస్ టీన్ గుజరాత్ టైటిల్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత ఫిబ్రవరీ 28, 2023 స్పెయిన్ లోని మాడ్రిడ్‌లో జరిగిన మిస్ టీన్ యూనివర్స్ పోటీల్లో రియా భారత దేశానికి ప్రాతినిధ్యం వహించింది.
5/8
మిస్ టీన్ పోటీల్లో 25 మంది అభ్యర్థులతో భారత్ తరుపున పోటీపడిన రియా టాప్ 6లో స్థానంలో నిలిచింది.
6/8
ఆ తర్వాత మళ్ళీ ఏప్రిల్ 19, 2023.. ముంబైలో జరిగిన JOY టైమ్స్ ఫ్రెష్ ఫేస్ సీజన్ 14లో 14 మంది కంటెస్టెంట్స్ తో పోటీపడి రన్నరప్‌గా సత్తా చాటింది రియా
7/8
తాజాగా సెప్టెంబర్ 22, 2024 మిస్ యూనివర్స్ పోటీల్లో 18 ఏళ్లకే మిస్ యూనివర్స్ ఇండియా కెరటాన్ని కైవసం చేసుకొని మరోసారి అందరినీ ఆకర్షించింది రియా. ‘గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024లో రియా ఇండియాకు ప్రాతినిధ్యం వహించనుంది. రియా GLS యూనివర్శిటీ గుజరాత్ లో ఆర్ట్స్ విభాగంలో డిగ్రీ చేస్తోంది.
8/8
రియా తాను మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకోవడం పై ఆనందం వ్యక్తం చేసింది. ఈ పోటీల్లో పాల్గొనడం కోసం తాను ఎంతో కష్టపడ్డానని.. ఈ స్థాయికి చేరుకోవడం వెనుక చాలా కృషి ఉందని తెలిపింది. గతంలో గెలిచిన విజేతలను తాను స్ఫూర్తిగా తీసుకున్నానని చెప్పింది.
సంబంధిత కథనాలు
Advertisment
Here are a few more articles:
{{#pages}}
{{title}}
{{url}}
{{image}}
{{/pages}}