Mirai Collections: మిరాయ్ కలెక్షన్స్ ఊచకోత.. తేజ సజ్జా దుమ్ము దులిపేసాడుగా!

యంగ్ హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 7 రోజుల్లోనే ₹112.10 కోట్లు గ్రాస్ కలెక్షన్ రాబట్టింది. పెద్ద సినిమాలేవి లేకపోవడం, కంటెంట్‌ బాగుండడంతో ఈ సినిమా తేజకు మంచి హిట్ ఇచ్చింది.

New Update
Mirai Collections

Mirai Collections

Mirai Collections:

తేజ సజ్జా(Teja Sajja) హీరోగా నటించిన తాజా చిత్రం "మిరాయ్" భారీ విజయం సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టిస్తోంది. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందన తెచ్చుకుంటోంది. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం మొదటి వారం ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా ₹112.10 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి ప్రేక్షకులను, పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ సినిమా విడుదలైన తొలి ఐదు రోజుల్లోనే ₹100 కోట్ల క్లబ్‌లోకి అడుగుపెట్టడం విశేషం. తాజాగా మేకర్స్ విడుదల చేసిన పోస్టర్ ద్వారా ఈ 7 రోజుల కలెక్షన్లను అధికారికంగా వెల్లడించారు. ఈ అద్భుత విజయంతో మిరాయ్ టాలీవుడ్‌లో టాప్ గ్రాసర్స్‌లో ఒకటిగా నిలిచింది. ఇక మరోవైపు సెప్టెంబర్ 25 వరకు ఏ పెద్ద సినిమా విడుదల కావడం లేదన్న విషయం కూడా మిరాయ్ కలెక్షన్లకు కలసివచ్చే అంశంగా విశ్లేషకులు చెబుతున్నారు.

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది. విశ్వప్రసాద్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించగా, తేజ సజ్జా సరసన రితికా నాయక్ కథానాయికగా కనిపించింది. ఇక మంచు మనోజ్ కీలకమైన విలన్ పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అదేవిధంగా శ్రియ శరణ్, జగపతిబాబు, జయరాం వంటి నటులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ సినిమా కథ విషయానికొస్తే అశోకుడి తొమ్మిది గ్రంథాలు అనే ప్రాచీన కాన్సెప్ట్. ఇందులో ఫాంటసీ, అడ్వెంచర్, యాక్షన్ అంశాలను సమపాళ్లలో మిక్స్ చేసి, ఒక పాన్ ఇండియా స్థాయిలో తీసిన విజువల్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.

ఇలాగే కొనసాగితే, మిరాయ్ తేజ సజ్జా కెరీర్‌లో టర్నింగ్ పాయింట్‌గా నిలవడమే కాకుండా, టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు కూడా నమోదు చేసే అవకాశం ఉంది. మొత్తం మీద, మిరాయ్ చిత్రానికి మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది, రాబోయే రోజుల్లో ఈ క్రేజ్ కొనసాగుతుందన్నది స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisment
తాజా కథనాలు