మెగాస్టార్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. వాటిలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం ఒకటి. 'సంక్రాంతికి వస్తున్నాం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి నుంచి వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం వచ్చేఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. రేపు ఫస్ట్ సింగిల్ ప్రోమో విడుదల చేయనున్నట్లు తెలిపారు. మెగా ఆల్బమ్ లోడింగ్.. మెగా గ్రేస్, స్వాగ్ ఎంజాయ్ చేసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ చిన్న వీడియోను రిలీజ్ చేశారు. చూస్తుంటే.. ఈ పాట ఫుల్ ఎనర్జిటిక్ గా, మాస్ బీట్స్ తో ఉండబోతుందని తెలుస్తోంది. దీంతో మెగా ఫ్యాన్స్ పాట ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
MEGA ALBUM LOADING 🎵🔥
— Gold Box Entertainments (@GoldBoxEnt) October 1, 2025
Get ready to vibe and celebrate the MEGA Grace,
MEGA Class,
MEGA Swag &
MEGA VICTORY MASS of #ManaShankaraVaraPrasadGaru ❤️🔥
First Single Promo out Tomorrow 😍🫶
A #BheemsCeciroleo Musical 🎵#ChiruANIL ~ #MSG Sankranthi 2026 RELEASE 🔥
Megastar… pic.twitter.com/3I7MAB7GuZ
శశిరేఖగా నయన్
పక్కా ఫ్యామిలీ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో మెగాస్టార్ పాత్ర 'ఘరానా బుల్లోడు, గ్యాంగ్ స్టార్' సినిమాల తరహాలో ఉండనుంది. ఇందులో చిరంజీవి జోడీగా నయనతార నటిస్తోంది. తాజాగా దసరా సందర్భంగా సినిమా నుంచి నయన్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. ఇందులో నయన్ శశిరేఖా పాత్రలో నటిస్తున్నారు. సాంప్రదాయ చీరకట్టులో ఆమె లుక్ అదిరిపోయింది.
వింటేజ్ వైబ్స్
షైన్ స్క్రీన్ బ్యానర్ పై మెగాస్టార్ పెద్ద కూతురు సుష్మిత కొణిదెల, సాహు గారపాట సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అనిల్ మరోసారి ప్రేక్షకులకు వింటేజ్ మెగాస్టార్ వైబ్స్ అందించబోతున్నారు. ఇందులో చిరు తన ఒరిజినల్ పేరు శంకర వరప్రసాద్ పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే మెగాస్టార్ లుక్ కి సంబంధించి చిన్న వీడియో రిలీజ్ చేయగా.. సూటు, బూటు కళ్ళజోడుతో చాలా స్టైలిష్ గా కనిపించారు.