OG Success Meet: మైండ్ బ్లోయింగ్.. 'ఓజీ' ఈవెంట్ లో పిచ్చెక్కిస్తున్న పవర్ స్టార్ లుక్! ఫొటోలు చూశారా!

ఓజీ సక్సెస్ ఈవెంట్ లో డిప్యూటీ సీఎం  పవర్ స్టార్ లుక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బ్లాక్ టీషీర్ట్ లో పవర్ స్టార్ చాలా స్టైలిష్ గా కనిపించారు.

New Update

OG Success Meet: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన సందర్భంగా మూవీ టీమ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. పవన్ కళ్యాణ్, డైరెక్టర్ సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, ప్రియాంక మోహన్, ప్రొడ్యూసర్ దానయ్య ఈ ఈవెంట్ కి హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య కూడా పాల్గొంది. సక్సెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ చిత్రబృదానికి, డైరెక్టర్ సుజీత్ కి కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సినిమాకు సంబంధించిన విశేషాలను పంచుకున్నారు. అలాగే ప్రేక్షకులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. 

స్టైలిష్ లుక్ 

సక్సెస్ ఈవెంట్ లో డిప్యూటీ సీఎం  పవర్ స్టార్ లుక్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. బ్లాక్ టీషీర్ట్ లో పవర్ స్టార్ చాలా స్టైలిష్ గా కనిపించారు. జానీ, బద్రీ టైంలో ఉన్న పవన్ ని గుర్తుచేసింది. యంగ్ అండ్ డైనమిక్ గా కనిపిస్తూ.. ఫ్యాన్స్ కు పిచ్చెక్కించారు. పవన్ కళ్యాణ్, తమన్ స్టేజ్ పై గన్ పట్టుకొని ఫొటోలకు ఫోజులిచ్చారు. బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్, గాగుల్స్, చేతిలో గన్ పట్టుకొని అదరగొట్టారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 

గత నెల 5న థియేటర్స్ లో విడుదలైన 'ఓజీ' బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత పవర్ స్టార్ అభిమానులకు మంచి కిక్కిచ్చిన సినిమా అనిపించుకుంది. పవన్ కళ్యాణ్ కేరీర్ లోనే అత్యధిక వసూల్లు, ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా 'ఓజీ' నిలిచింది. వారం రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్ లో చేరిన ఈ చిత్రం.. రూ. 300 కోట్ల దిశగా దూసుకెళ్తోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ లుక్,  స్టైల్, స్క్రీన్ ప్రజెన్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అభిమానులు పవర్ స్టార్ ను ఎలా చూడాలనుకున్నారో .. అలా చూపించడంలో సక్సెస్ అయ్యాడు ఫ్యాన్ బాయ్ సుజీత్.

డైరెక్టర్ సుజీత్ పవర్ కళ్యాణ్ కి వీరాభిమాని!  కాలేజీ రోజుల నుంచి ఆయన సినిమాలు చూస్తూ, ఆయనను అభిమానిస్తూ పెరిగారు. ఒక ఫ్యాన్ బాయ్ తన హీరోతో సినిమా చేయాలనే కోరికను నెరవేర్చుకున్నాడు.

ప్రీక్వేల్, సీక్వేల్

సక్సెస్ మీట్ లో పవన్ మాట్లాడుతూ... 'ఓజీ' ప్రీక్వెల్స్, సీక్వెల్స్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఖచ్చితంగా సుజీత్ తో  ఓజీ  సీక్వేల్, ప్రీక్వేల్ చేస్తానని తెలిపారు. కానీ కొన్ని షరతులు ఉంటాయని సరదాగా నవ్వుకున్నారు.

అలాగే పవన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కట్టి పట్టుకొని స్టేజ్ పైకి రావడం తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. "నాకు ఇలాంటి చేయాలంటే కాస్త సిగ్గు, మొహమాటంగా ఉంటుంది. సుజీత్ అండ్ టీమ్ దీని గురించి చెప్పినప్పుడు ముందుగా చేయకూడదని అనుకున్నాను. కానీ, వాళ్లు ఈ సినిమా కోసం పడిన కష్టం చూసిన తర్వాత.. వాళ్ళ పై ప్రేమతో అలా చేయడానికి ఒప్పుకున్నాను" అని తెలిపారు.

Advertisment
తాజా కథనాలు