టాలీవుడ్ లో ఇప్పుడంతా అందాల బ్యూటీ మీనాక్షి చౌదరి పేరే వినిపిస్తోంది. సుశాంత్ హీరోగా వచ్చిన 'ఇచ్చట వాహనములు నిలపరాదు' సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తర్వాత వరుసగా యంగ్ హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. కాగా ఈ ఏడాది మహేష్ బాబుతో గుంటూరు కారం, దళపతి విజయ్ తో గోట్ సినిమాలతో సూపర్ క్రేజ్ అందుకుంది.
ఈ హీరోయిన్ తాజాగా నటించిన 'లక్కీ భాస్కర్' చిత్రం దీపావళి కానుకగా థియేటర్స్ లో రిలీజై హిట్ టాక్ అందుకుంది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా మూవీ టీమ్ బాలయ్య హోస్ట్ చేస్తున్న 'అన్ స్టాపబుల్ 4 ' టాక్ షోలో పాల్గొన్నారు.
Also Read : 'పుష్ప 2' లో బిగ్ సర్ప్రైజ్.. ఫ్యాన్స్ కు పండగే
ఈ కార్యక్రమంలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి, వెంకీ అట్లూరి, నాగవంశీ పాల్గొన్నారు. దీనికి సంబంధించిన ఎపిసోడ్ స్ట్రీమింగ్కు అందుబాటులోకి వచ్చింది. ఇందులో హీరోయిన్ మీనాక్షి సినిమా విశేషాలతోపాటు తన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. షోలో భాగంగా బాలకృష్ణ.. సినిమాల్లోకి రావడానికి కారణం ఏమిటి? అని మీనాక్షిని అడిగారు.
అస్సలు అనుకోలేదు..
అందుకు ఆమె బదులిస్తూ..'చదువు పరంగా నేనొక డెంటిస్ట్‌ని. ఓసారి మిస్ ఇండియా పోటీల్లో పాల్గొన్నా. అందులో విజయం సాధించాక సినిమాల్లోకి వచ్చా. ఈ రంగంలోకి రావాలని అస్సలు అనుకోలేదు. ముంబయిలో వర్క్‌షాప్‌లో పాల్గొన్నా. అక్కడ సుశాంత్‌తో పరిచయమైంది.
Also Read : నవంబర్ 1 నుంచి షూటింగ్స్ బంద్
ఆయన హీరోగా యాక్ట్ చేసిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో తెలుగులోకి అడుగుపెట్టా. ఇదంతా విధి అని నమ్ముతా..' అంటూ చెప్పుకొచ్చింది. సినిమాల్లోకి రాకముందు మీనాక్షి డెంటిస్ట్ గా వర్క్ చేసిందని తెలిసి పలువురు నెటిజన్స్ షాక్ అవుతున్నారు.