Mana Shankara Varaprasad Garu: వచ్చేసిన చిరంజీవి-నయనతార శశిరేఖ సాంగ్‌.. ఎలా ఉందంటే?

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న 'మన శంకర వర ప్రసాద్‌గారు' మూవీ నుంచి మరో ఫుల్ సాంగ్ లిరికల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వరుస హిట్‌లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి.

New Update

మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబోలో రాబోతున్న 'మన శంకర వర ప్రసాద్‌గారు' మూవీ నుంచి మరో ఫుల్ సాంగ్ లిరికల్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. వరుస హిట్‌లతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి దర్శకత్వం వహించడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. అయితే ఇది వరకు చిత్ర యూనిట్ మీసాల పిల్ల సాంగ్‌ను విడుదల చేయగా.. అది సూపర్ హిట్ అయ్యింది. ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో కొనసాగుతూ అత్యధిక వ్యూస్‌ను రాబడుతోంది.

ఇది కూడా చూడండి: RajaSaab OTT: ప్రభాస్ ‘ది రాజా సాబ్’ OTT డీల్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం ఇదే..!

పెద్దగా రాని రెస్పాన్స్..

ఇప్పుడు శశిరేఖ అనే రెండో లిరికల్ సాంగ్‌ను మూవీ టీం విడుదల చేసింది. ఈ పాటను సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో, ఫోక్ సింగర్ మధు ప్రియ కలిసి పాడారు. అయితే విడుదలైన కొద్దిసేపటికే ఈ పాట వ్యూస్‌ను రాబడుతోంది. కానీ ఈ సెకండ్ సింగిల్ సాంగ్‌కు అంత మంచి రెస్పాన్స్ అయితే రావడం లేదు. మీసాల పిల్ల సాంగ్‌కు ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణ అయితే ఈ పాట నుంచి రాదని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భీమ్స్ మ్యూజిక్ అన్నింటికి ఒకేలా ఉందని, సంక్రాంతికి వస్తున్నాం అనే పాటలానే ఉందని పలువురు అంటున్నారు. అలాగే లిరిక్స్ కూడా ఆకట్టుకునే విధంగా లేవని చెబుతున్నారు. 

ఇది కూడా చూడండి: Rajamouli Varanasi: మగధీర, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్, అన్ని కలిపితే వారణాసి: దర్శకుడు దేవ కట్ట

ఇదిలా ఉండగా ఈ సినిమాలో హీరోయిన్‌గా నయనతార నటిస్తోంది. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే హీరో విక్టరీ వెంకటేష్ కూడా ఇందులో గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. కేవలం క్లైమాక్స్ మాత్రమే ఉందని సమాచారం. ఈ చిత్రం సంక్రాంతికి రావడానికి రెడీ అవుతోంది. 

ఇది కూడా చూడండి: Rajasaab Premiers: అమెరికాలో గ్రాండ్ ప్రీమియర్‌కు రెడీ అయిన ప్రభాస్ ‘ది రాజా సాబ్’

Advertisment
తాజా కథనాలు