/rtv/media/media_files/2026/02/27/prithviraj-sukumaran-2026-02-27-07-31-42.jpg)
Prithviraj Sukumaran
Prithviraj Sukumaran: మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ Prithviraj Sukumaran మరో పెద్ద తెలుగు సినిమాలో మెరవనున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. హీరో నాని Nani నటిస్తున్న, దర్శకుడు సుజీత్ Sujeeth తెరకెక్కిస్తున్న బ్లడీ రోమియో Bloody Romeo సినిమాలో ఆయనకు ముఖ్యమైన పాత్ర ఇవ్వాలని చర్చలు జరుగుతున్నట్టు సమాచారం.
ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్ర కోసం పృథ్విరాజ్ పేరు పరిశీలిస్తున్నారని టాక్. ఇప్పటికే ఆయన దర్శక దిగ్గజం రాజమౌళి S. S. Rajamouli రూపొందిస్తున్న భారీ చిత్రం వారణాసి Varanasi లో మెయిన్ విలన్‌గా నటిస్తున్నారు. అందుకే మరో భారీ తెలుగు ప్రాజెక్ట్‌లో కూడా ఆయన కనిపించనున్నారన్న వార్త అభిమానుల్లో ఉత్సాహం పెంచింది.
అయితే బ్లడీ రోమియో Bloody Romeo విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. కానీ పృథ్విరాజ్ ఈ ప్రాజెక్ట్‌లో ఉంటే సినిమాకి మరింత బలం చేకూరుతుందని అభిమానులు భావిస్తున్నారు.దర్శకుడు రాజమౌళి S. S. Rajamouli తెరకెక్కిస్తున్న వారణాసి Varanasi సినిమా ప్రకటించినప్పటి నుంచి మంచి హైప్ ఉంది. ఈ సినిమాలో మహేష్ బాబు, ప్రియాంక చోప్రా తో పాటు పృథ్విరాజ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు.
ఈ చిత్రంలో పృథ్విరాజ్ “కుంభ” అనే విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఈ పాత్రలో ఆయన వీల్‌చైర్‌లో కనిపిస్తారని ఇప్పటికే పోస్టర్స్ ద్వారా తెలిపారు మేకర్స్. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ పాత్ర గురించి మాట్లాడిన పృథ్విరాజ్,ఈ పాత్ర తనకు పెద్ద సవాల్‌గా మారిందని చెప్పారు.
ఆయన మాట్లాడుతూ, సాధారణంగా నటుడు తన బాడీ లాంగ్వేజ్ న\ను బట్టి భావాలు చూపిస్తాడు. కానీ ఈ పాత్రలో మెడ కింద భాగం కనిపించదు. అందుకే ముఖ భావాలు, కళ్ల చూపులతోనే భావాలు వ్యక్తం చేయాల్సి వచ్చిందని అన్నారు.
కుంభ పాత్రలో ప్రతి మాట, ప్రతి చర్య వెనుక గతం ఉంటుంది. ఆ పాత్రలో చాలా లోతు ఉందని ఆయన చెప్పారు. ఒక్క కోణంలో కాకుండా, అనేక కోణాల్లో ఆ పాత్రను చూపిస్తారని తెలిపారు.
పృథ్విరాజ్ మాట్లాడుతూ, ఇది తన కెరీర్‌లో అత్యంత క్లిష్టమైన పాత్రల్లో ఒకటని చెప్పారు. రాజమౌళి గారు సృష్టించిన పాత్రల్లో ఇది చాలా ప్రత్యేకమని కూడా అన్నారు.
వారణాసి ‘Varanasi’ సినిమా గురించి
వారణాసి Varanasi సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంతో ఉండనుందని వార్తలు వినిపిస్తున్నాయి. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న విడుదల కానుందని సమాచారం.
మొత్తానికి, పృథ్విరాజ్ సుకుమారన్ వరుసగా పెద్ద తెలుగు ప్రాజెక్ట్‌లలో నటించడం అభిమానులకు ఆనందంగా మారింది. బ్లడీ రోమియో Bloody Romeo లో ఆయన నటిస్తారా లేదా అన్న విషయం త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
మరిన్ని తాజా సినిమా వార్తల కోసం మా వెబ్‌సైట్(https://rtvlive.com/)ను ఫాలో అవ్వండి.
Follow Us