Unni Mukundan: హీరో ఉన్ని ముకుందన్‌కు కోర్టు సమన్లు.. మేనేజర్‌ పై దాడి! అసలేం జరిగింది?

మలయాళ నటుడు ఉన్నిముకుందన్ కి చిక్కుల్లో పడ్డారు. తన మాజీ మేనేజర్ విపిన్ కుమార్ పై దాడి చేశారనే ఆరోపణల కేసులో కేరళలో కాక్కనాడ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు సమన్లు  జారీ చేసింది.

New Update
Unni Mukundan

Unni Mukundan

Unni Mukundan: మలయాళ నటుడు ఉన్నిముకుందన్ కి చిక్కుల్లో పడ్డారు. తన మాజీ మేనేజర్ విపిన్ కుమార్ పై దాడి చేశారనే ఆరోపణల కేసులో కేరళలో కాక్కనాడ్ మేజిస్ట్రేట్ కోర్టు ఆయనకు సమన్లు  జారీ చేసింది. అయితే మేనేజర్ విపిన్ కుమార్ తన సోషల్ మీడియాలో నటుడు టోవినో థామస్ సినిమా 'నరివెట్ట'ను పొగుడుతూ ఓ పోస్ట్ పెట్టారు. దీని కారణంగానే ఉన్ని ముకుందన్ కి కోపం వచ్చి అతడి పై దాడి చేశాడని, బూతులు తిట్టాడని విపిన్  ఫిర్యాదులో  పేర్కొన్నారు. 

ఈ ఫిర్యాదు మేరకు  ఇన్ఫో పార్క్ పోలీసులు ఉన్నిముకుందన్ పై  కేసు నమోదు చేసి, దర్యాప్తు తర్వాత కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. దీని ఆధారంగా   కోర్టు ఉన్ని ముకుందన్  కి సమన్లు జారీ చేసింది. అక్టోబర్ 27న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. మరోవైపు మేనేజర్ ఆరోపణలను ఉన్ని ముకుందన్ ఖండించారు. విపిన్ తన ప్రతిష్టను దిగజార్చడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆయన చెప్పారు. తాను  విపిన్ కళ్లద్దాలు మాత్రమే పగలగొట్టానని అంగీకరించారు. అయితే విపిన్ కుమార్ తన ఫిర్యాదులో మరో విషయాన్ని పేర్కొన్నారు. "మార్కో" సినిమా ఫెయిల్ అయిన తర్వాత ఉన్ని ముకుందన్ ఒత్తిడికి లోనయ్యారని, అందుకే తన కోపాన్ని ఇతరులపై చూపిస్తున్నారని ఆరోపించారు.

Also Read: Kantara Chapter-1 Trailer: 'కాంతార చాప్టర్ 1' ట్రైలర్ వచ్చేసింది.. ఈసారి గూస్ బంప్స్ అంతే!

Advertisment
తాజా కథనాలు