Globe Trotter Event Passport: 'సంచారి' వచ్చేస్తున్నాడు.. 'గ్లోబ్ ట్రాటర్' ఈవెంట్ కు ఆల్ సెట్..!

మహేష్ బాబు- రాజమౌళి భారీ యాక్షన్ సినిమా 'గ్లోబ్ ట్రాటర్' నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో గ్రాండ్ ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్‌కు ప్రత్యేకంగా పాస్‌పోర్ట్ లాంటి పాస్‌లు తయారు చేయడం హైలైట్‌గా మారింది. ఈవెంట్‌పై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది.

New Update
Globe Trotter Event Passport

Globe Trotter Event Passport

Globe Trotter Event Passport: మహేష్ బాబు(Mahesh Babu)-రాజమౌళి(Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రపంచ స్థాయి యాక్షన్–అడ్వెంచర్ చిత్రం షూటింగ్ వేగంగా సాగుతోంది. గ్లోబ్ ట్రాటర్ అనే వర్కింగ్ టైటిల్‌తో ముందుకు వెళుతున్న ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో, సినీ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. మహేష్ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రంగా ఇది నిలవనుందని అందరూ భావిస్తున్నారు.

ఈ సినిమా నుంచి పెద్ద అప్‌డేట్స్‌ నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగనున్న గ్రాండ్ ఈవెంట్‌లో విడుదల కానున్నాయి. ఆ ఈవెంట్‌పై ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ పెరిగిపోయింది. పాసుల కోసం ఫ్యాన్స్ తెగ ట్రై చేస్తున్నారు. 

పాస్‌పోర్ట్ స్టైల్‌లో ఈవెంట్ పాస్‌లు - రాజమౌళి స్ట్రాటజీ హైలైట్!

ఈవెంట్‌కు హాజరయ్యే అభిమానుల కోసం టీమ్ ప్రత్యేకంగా పాస్‌పోర్ట్‌లా కనిపించే పాస్‌లను తయారు చేసింది. పసుపు రంగు అట్టతో రూపొందించిన ఈ పాస్‌లు అచ్చం అసలైన పాస్‌పోర్ట్‌లా కనిపిస్తున్నాయి. పాస్ ముందుభాగంపై “GLOBETROTTER EVENT”, “PASSPORT” అని ప్రత్యేకంగా ముద్రించారు. లోపల మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, రాజమౌళి ఫోటోలు ఉన్నాయి. ఈవెంట్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్, ప్రవేశ మార్గాలు, మ్యాప్ వంటి వివరాలు కూడా జత చేశారు.

మహేష్ ప్రీలుక్‌లో కనిపించిన త్రిశూలం లోగో ఆధారంగా ఈ పాస్ డిజైన్ చేయడం అభిమానులను మరింత ఆకట్టుకుంది. ఈ ఐడియా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఫ్యాన్స్ కామెంట్ చేస్తూ “ఇది కేవలం డిజైన్ కాదు, పక్కా మార్కెటింగ్ ప్లాన్” అని అంటున్నారు. పాస్‌పోర్ట్ అనే పేరు వాడడం వల్ల ఈవెంట్‌కు ఒక ప్రత్యేకమైన విలువ, థీమ్ వచ్చిందని కూడా చెబుతున్నారు.

రాజమౌళి వీడియో వైరల్ 

ఇటీవల రాజమౌళి విడుదల చేసిన వీడియోలో, ఈవెంట్‌కు ఒరిజినల్ పాస్ ఉన్నవారినే అనుమతిస్తామని స్పష్టంగా చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు రూమర్స్‌ను నమ్మవద్దని అభిమానులను హెచ్చరించారు. పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో ‘కుంభ’ అనే శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రియాంక చోప్రా ‘మందాకిని’ అనే కీలక పాత్రలో ప్రేక్షకులను అలరించనుంది. అంతేకాదు, ఇటీవల విడుదలైన “సంచారి” సాంగ్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. శ్రుతి హాసన్ ఆలపించిన ఈ పాట యూట్యూబ్ ట్రెండింగ్‌ అవుతోంది.

మొత్తం మీద, గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్‌కు సంబంధించిన రాజమౌళి టీమ్ ప్ర‌మోషన్ స్ట్రాటజీ సినిమాపై హైప్‌ను మరింత పెంచేసింది. అభిమానులు ఇప్పుడు నవంబర్ 15 ఈవెంట్ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.  

Advertisment
తాజా కథనాలు