Ghattamaneni Jayakrishna: హీరోగా ఎంట్రీ ఇస్తున్న మహేష్ బాబు కొడుకు! డైరెక్టర్ ఎవరో తెలుసా..?

“RX 100” దర్శకుడు అజయ్ భూపతి తన కొత్త సినిమా AB4లో కృష్ణ గారి మనవడు ఘట్టమనేని జయకృష్ణను హీరోగా పరిచయం చేస్తున్నారు. రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని హీరోయిన్‌గా నటించనుంది.

New Update
Mahesh Babu Nephew

Ghattamaneni Jayakrishna

Ghattamaneni Jayakrishna: “RX 100”, “మంగళవారం” సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు అజయ్ భూపతి ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ AB4 ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాతో టాలీవుడ్‌కు ఒక కొత్త హీరో పరిచయమవుతున్నాడు.

ఆ హీరో మరెవరో కాదు సూపర్‌స్టార్ మహేష్ బాబు అన్న కొడుకు, లెజెండరీ నటుడు కృష్ణ గారి మనవడు, ఘట్టమనేని రమేష్ బాబు గారి కుమారుడు అయిన ఘట్టమనేని జయకృష్ణ. ఈ చిత్రం ద్వారా ఆయన హీరోగా తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నారు.

Also Read: SSMB29 తాజా అప్‌డేట్: 'గ్లోబ్ ట్రాటర్' నుంచి ప్రియాంక చోప్రా లుక్ వచ్చేస్తోంది..!

ఇంటెన్స్ లవ్ స్టోరీ..

అజయ్ భూపతి తన సినిమాల్లో ఎప్పుడూ కొత్తదనం చూపిస్తారు. ఈసారి కూడా అదే తరహాలో ఒక ఇంటెన్స్ లవ్ స్టోరీని తెరకెక్కించబోతున్నారని సమాచారం. కథ ప్రేమతో పాటు భావోద్వేగాలు, యాక్షన్, సస్పెన్స్ అంశాలతో నిండివుంటుందని టాక్. ఇంకా ఒక ప్రత్యేక అంశం ఏమిటంటే ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా థడాని నటించనుందని వార్తలు వస్తున్నాయి. ఇది ఆమె తొలి సినిమా కావడంతో అభిమానుల్లో మంచి ఆసక్తి నెలకొంది.

Also Read: 'కే ర్యాంప్' ఎంటర్టైన్మెంట్..! ఇప్పుడు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే...?

సినిమా టైటిల్‌ను త్వరలోనే ప్రకటించబోతున్నారు. అజయ్ భూపతి సినిమాలు ఎప్పుడూ పవర్ ఫుల్ టైటిల్స్‌ తో వస్తాయి కాబట్టి, ఈసారి కూడా ఏ పేరును ఎంచుకున్నారో చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత జెమినీ కిరణ్ తన బ్యానర్ చందమామ కథలు పిక్చర్స్ పై నిర్మిస్తున్నారు. మరొక ప్రముఖ నిర్మాత అశ్విని దత్ ఈ సినిమాకు ప్రెజెంటర్‌గా వ్యవహరిస్తున్నారు.

Also Read: 'SSMB 29' ఈవెంట్ కు భారీ సెటప్‌.. స్టేజ్ ఎంత పెద్దదో తెలిస్తే..!

సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. మేకర్స్ త్వరలోనే మిగతా నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలను ప్రకటించనున్నారు. మొత్తం మీద, మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి మరో స్టార్ ఎంట్రీకి సిద్ధమవుతున్నాడు. అజయ్ భూపతి దర్శకత్వం, కొత్త జంటగా జయకృష్ణ రాషా థడాని కాంబినేషన్, ఇంటెన్స్ లవ్ స్టోరీ అనే అంశాలు కలవడంతో సినిమా మీద మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి.

Also Read: 'గ్లోబ్ ట్రాటర్' కోసం ఇద్దరు ప్రొడ్యూసర్స్.. పెద్ద ప్లానింగే ఇది..!

Advertisment
తాజా కథనాలు