/rtv/media/media_files/2025/03/15/ZvaqpwnvyBe0wiHSiFsf.jpg)
Kaithi 2 Updates
Also Read: Court Movie: కంటెంట్ ముఖ్యం బిగులు.. పావురాలు ఎగరేస్తూ 'కోర్ట్' టీమ్ సక్సెస్ సెలెబ్రేషన్స్!
అయితే ఈ మూవీ లో చాలా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేదు లోకేష్, అసలు హీరో జైలుకి ఎందుకొచ్చాడు, ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరిగింది అనేవి డైరెక్టర్ పార్ట్ 1 లో రివీల్ చేయలేదు. అయితే ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం ఇప్పుడు పార్ట్ 2 లో దొరకబోతున్నాయి. ఖైదీ సీక్వెల్ లో స్టోరీ మొత్తం రివీల్ చేయనున్నాడు లోకేష్.
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి
'కూలీ' తర్వాత 'ఖైదీ' సీక్వెల్..?
ప్రస్తుతం, లోకేష్ సూపర్ స్టార్ రజినీకాంత్ 'కూలీ' మూవీతో ఫుల్ బిజీగా ఉన్నాడు. "కూలి" సినిమా ఈ దసరా లేదా దీపావళికి విడుదల అవుతుందని సమాచారం. కూలీ మూవీ కంప్లీట్ అవ్వగానే లోకేష్ ఖైదీ సీక్వెల్ కి షిఫ్ట్ అవ్వాలి కానీ ఖైదీ 2 , 2026 ఏప్రిల్ కు వాయిదా పడిందని తాజాగా తెలుస్తోంది. అంటే లోకేష్ ఈ గ్యాప్ లో 'కూలీ' పూర్తవ్వగానే సూర్యా తో 'రోలెక్స్' మూవీని తెరకెక్కించే ఛాన్సులు కూడా ఉన్నాయి. మరి లోకేష్ కూలీ తర్వాత 'ఖైదీ' సీక్వెల్ ను తెరకెక్కిస్తాడా? లేదా 'రోలెక్స' ని లైన్లోకి దించుతాడో వేచి చూడాలి.
Also Read: హనీమూన్ సిస్టిటిస్ అంటే ఏమిటి? కొత్తగా పెళ్ళైన అమ్మాయిలు ఈ విషయాలు తెలుసుకోవాలి
అయితే, సూర్య 44 మూవీ 'రెట్రో' ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని 1 May 2025న విడుదలకు సిద్ధమవుతోంది. తరువాత 45వ సినిమా కూడా షూటింగ్ దశలో ఉంది. మరి 'రోలెక్స' కి సూర్య డేట్స్ ఎప్పుడు ఇస్తాడో ఇంకా క్లారిటీ లేదు. కమల్ హస్సన్ కూడా వరుస మూవీస్ తో ఫుల్ బిజీగా ఉన్నారు లోకేష్ 'విక్రమ్-2' కి కమల్ కూడా ఇప్పట్లో డేట్స్ ఇచ్చేలా కనిపించడం లేదు.
ఇవ్వన్నీ చూసుకుంటే 'కూలీ' మూవీతో భారీ బ్లాక్ బస్టర్ కొట్టిన తర్వాత లోకేష్ 'ఖైదీ' సీక్వెల్ నే పట్టాలెక్కించేలాగా కనిపిస్తోంది. మరి లోకేష్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.