Sai Marthand: 'లిటిల్ హార్ట్స్' సూపర్ హిట్ తర్వాత డైరెక్టర్ సాయి మార్తాండ్ బిగ్ ప్లాన్.. హీరో ఎవరో తెలుసా..?

‘లిటిల్ హార్ట్స్’ దర్శకుడు సాయి మార్తాండ్ తన తదుపరి సినిమాను అడివి శేష్‌తో చేయనున్నారు. షూటింగ్ మే 2026లో ప్రారంభం కానుంది. ఈ సినిమాను జగపతి బాబు, ఏషియన్ సునీల్ నారంగ్ కలిసి నిర్మించనున్నారు.

New Update
Sai Marthand

Sai Marthand

Sai Marthand: ‘లిటిల్ హార్ట్స్’ (2025) సినిమా ఘన విజయం సాధించి నిర్మాతలకు మంచి లాభాలు తెచ్చిపెట్టింది. ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సాయి మార్తాండ్ తన దర్శకత్వంతో మంచి పేరు తెచ్చుకున్నారు. సినిమా విడుదలై కొన్ని నెలలు గడిచినా, ఆయన తదుపరి ప్రాజెక్ట్ గురించి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.

అయితే తాజా సమాచారం ప్రకారం, సాయి మార్తాండ్ తన తదుపరి సినిమాను అడివి శేష్తో చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘డాకాయిట్’ షూటింగ్‌లో బిజీగా ఉన్న అడివి శేష్(Adivi Sesh), ఈ కొత్త సినిమాకు ఇప్పటికే కథ వినేశారని సమాచారం. అన్నీ కుదిరిపోయి, ఈ సినిమా షూటింగ్ మే 2026లో ప్రారంభం కానుంది.

ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ సినిమాను ప్రముఖ నటుడు జగపతి బాబు నిర్మించనున్నారు. ఆయనతో పాటు ఏషియన్ సునీల్ నారంగ్ కూడా ఈ ప్రాజెక్ట్‌కు భాగస్వామిగా ఉంటారని తెలుస్తోంది. తాజాగా అడివి శేష్, సాయి మార్తాండ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం వల్ల ఈ ప్రాజెక్ట్‌పై మరింత స్పష్టత వచ్చింది.

సరైన సమయం చూసి ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన చేయాలని టీమ్ భావిస్తోంది. అంతవరకు అడివి శేష్ ‘డాకాయిట్’ సినిమా షూటింగ్ పూర్తి చేయనున్నారు. అలాగే ‘గూడాచారి’కి సీక్వెల్ అయిన G2 కూడా ఆయన లైనప్‌లో ఉంది. ఈ కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో బయటకు రానున్నాయి.

Advertisment
తాజా కథనాలు