Vastu Tips: ఈ వాస్తు నివారణాలతో డబ్బు సమస్యలన్నీ పరార్! చేతిలో డబ్బే డబ్బు

కుటుంబంలో నిరంతరం ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా డబ్బు  సమస్యలు తొలగిపోయి ఇంట్లో శ్రేయస్సు లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

New Update
money

money

Vastu Tips: కొందరు రాత్రి, పగలు కష్టపడి పని చేసినా చేతిలో డబ్బు ఉండదు. ఏదో ఒక విధంగా ఖర్చవడం, నిరంతరం ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కోవడం జరుగుతుంది. ఇలా  కుటుంబంలో నిరంతరం ఆర్ధిక ఇబ్బందులతో సతమతమవుతున్న వారు కొన్ని వాస్తు చిట్కాలను పాటించడం ద్వారా డబ్బు  సమస్యలు తొలగిపోయి ఇంట్లో శ్రేయస్సు లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.. 

ఆర్థిక లాభం కోసం వాస్తు నివారణలు

నోటి తడి చేయకండి

డబ్బు అంటే లక్ష్మీ దేవితో సమానం.. కావున వాస్తు ప్రకారం డబ్బును లెక్కించేటప్పుడు వాటికి ఉమ్ము అంటించకుండా లెక్కించాలి. అలాగే మీరు ఎవరి నుంచి డబ్బు తీసుకున్నా  కుడి చేతితో మాత్రమే తీసుకోవాలి.

లాకర్‌ దిశ

తరచూ ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కునే వారు వాస్తు ప్రకారం.. ఇంటికి పశ్చిమ-నైరుతి దిశలో లాకర్ లేదా డబ్బు సేవ్ చేసే పిగ్గీ బ్యాంకును ఉంచండి. అలాగే ప్రతిరోజు అందులో కొంత డబ్బు వేయడం ద్వారా ఇంట్లో డబ్బు నిలుస్తుందని చెబుతారు. 

ఇలా పట్టుకోవద్దు 

వాస్తు శాస్త్రం ప్రకారం, డబ్బు నోట్లను కత్తెరలా పెట్టుకోవద్దు. ఇలా చేస్తే లక్ష్మీ దేవిని అవమానించినట్లు అవుతుంది. దీనివల్ల ఆర్ధిక సమస్యలు తలెత్తుతాయని చెబుతారు. 

చీపురు 

వాస్తు శాస్త్రం ప్రకారం చీపురును లక్ష్మీదేవికి చిహ్నంగా భావిస్తారు. ఇంటి చీపురును ఎల్లప్పుడూ దాచి ఉంచాలి. అయితే డబ్బు ఉంచే ప్రదేశంలో లేదా పూజా స్థలంలో చీపురును ఉంచకూడదని గుర్తుంచుకోండి.

ఉప్పు నివారణ 

వాస్తు శాస్త్రం ప్రకారం, ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి, ఇంట్లో ఈశాన్య దిశలో ఒక పాత్రలో ఉప్పును  ఉంచాలి. అలాగే ఆ ఉప్పును  ఎప్పటికప్పుడు ఉప్పును మార్చాలి. అలా చేయడం ద్వారా ఇంట్లో సంపద ఉంటుందని నమ్ముతారు.

మంచం మీద ఆహారం తినవద్దు.. 

వాస్తు శాస్త్రం ప్రకారం, మంచం మీద ఆహారం తినడం వల్ల ఇంట్లో పేదరికం వస్తుందని చెబుతారు. కావున ..  ఇంట్లో శ్రేయస్సు , అదృష్టం కోసం  మంచం మీద ఆహారం తినడం మానేయాలి. అలాగే బెడ్ రూమ్ లో మురికి, ఎంగిలి  పాత్రలను ఉంచకూడదు.

Also Read: Mogali Rekulu: నాకు 'మొగలిరేకులు' కష్టాలు.. స్టేజీ మీదే మంత్రి కోమటిరెడ్డి ఆవేదన.. వీడియో వైరల్!

Advertisment
Advertisment
తాజా కథనాలు