Kiara Advani: హృతిక్ రోషన్- ఎన్టీఆర్ 'వార్ 2' ట్రైలర్ సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయ్యిందో.. ట్రైలర్ లో కియార బికినీ లుక్ కూడా అదే రేంజ్ లో నెట్టింట వైరల్ అయ్యింది. బికినీలో కియారా హాట్ స్టన్నింగ్ లుక్స్ అందరి దృష్టిని ఆకర్షించాయి. ఆమె ఫిట్ నెస్, అందమైన ఆకృతి ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసింది. అయితే కియారా అద్భుతమైన ఫిట్ నెస్, నాజూకైన అందాల వెనుక సీక్రెట్ ఏంటో.. ఆమె న్యూట్రిషనిస్ట్ తెలిపింది.
ఫిట్నెస్ మంత్ర
చాలా మంది స్లిమ్ గా, నాజూక్కా కనిపించేందుకు క్రాష్ డైట్ ఫాలో అవ్వడం లేదా విపరీతమైన వర్కౌట్స్ చేస్తూ తెగ కష్టపడుతుంటారు. కానీ కియార మాత్రం ఇవేవి చేయలేదట.. వీటికి బదులుగా సమతుల్యత, క్రమశిక్షణతో కూడిన ఆహార జీవన శైలిని పాటించారట. అదే ఆమె ఫిట్ నెస్ రహస్యమని చెప్పారు న్యూట్రిషనిస్ట్.
కియారా పోషకాహార నిపుణురాలు, నికోల్ లిన్హారెస్ కేడియా ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. కియార తన ఇంట్లో చేసిన సాంప్రదాయ భోజనానికే ప్రాధాన్యత ఇచ్చేదని తెలిపారు. అయితే, ఆమె ప్రోటీన్ ఇంటెక్ పెంచడానికి, కేలరీలను తగ్గించడానికి భోజనంలో కొన్ని మార్పులు ఉండేవి అని వెల్లడించారు.
ఆకుకూరలు, కూరగాయలు
ఆమె ఇంకా మాట్లాడుతూ.. "కియార భోజనాన్ని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకునేవాళ్ళు. నూనె నుంచి చీజ్ వరకు ప్రతి చిన్న పదార్థాన్ని ట్రాక్ చేసేవారు. ఆమె బ్రేక్ ఫాస్ట్ లో ఓట్, వాల్ నట్ మిక్స్ తో చేసిన ప్యాన్ కేక్స్ ఉండేవి. వీటిలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండేది. మధ్యాహ్నం, రాత్రి భోజనంలో ఫ్రెష్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఉండేవి. ఇందులో గ్రిల్ చికెన్, ఒక ఏదైన కూరగాయ, ఆకుకూరలు ఉంటాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండేవారు. అవకాడో వంటి హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉపయోగించేవారు. అలాగే వర్కౌట్ తర్వాత రికవరీ కోసం ప్రోటీన్ షేక్స్ కి బదులుగా సత్తుతో చేసిన పదార్థాలను తీసుకునేవారని" తెలిపారు. అలా తన రోజువారీ కార్యకలాపాలకు తగినట్లుగా కియార తన ఆహారంలో మార్పులు చూసుకునేవారని చెప్పారు న్యూట్రిషనిస్ట్.
స్లిమ్ గా, ఫిట్ కనిపించాలనే ఆత్రుతతో ఆరోగ్యాన్ని పాడుచేసుకునే హడావిడి డైట్‌లు పాటించడం కాకుండా పద్ధతి ప్రకారం తినడం, కన్సిస్టెన్సీ మెంటైన్ చేయడం ద్వారా కూడా ఫలితాలను పొందవచ్చని కియరా రుజువు చేసింది. అంతేకాదు ఆరోగ్యకరమైన జీవనశైలికి భారతీయ ఆహార పద్ధతులు ఎంతగానో ఉపయోగపడతాయని నిరూపించింది.
మొదటి బిడ్డకు జన్మ
ఇదిలా ఉంటే ఇటీవలే తన మొదటి బిడ్డకు జన్మనిచ్చిన కియార ప్రస్తుతం మదర్హుడ్ ఎంజాయ్ చేస్తోంది. కియార 2023లో నటుడు సిద్దార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు బిడ్డ పుట్టడంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.
ఇక వార్ 2 విషయానికి వస్తే.. ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే ట్రైలర్, ఇతర ప్రమోషనల్ కంటెంట్ విడుదలవగా సూపర్ బజ్ క్రియేట్ చేశాయి.