Lasya New House: వావ్.. లాస్య కొత్త ఇల్లు ఎంత బాగుందో.. వైరల్ అవుతున్న కొత్తింటి ఫొటోలు !

బుల్లి తెర యాంకర్, బిగ్ బాస్ ఫేమ్  లాస్య తన సొంతింటి కలను నిజం చేసుకుంది. తాజాగా తన కొత్తింట్లోకి గృహప్రవేశం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను లాస్య తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.

New Update
anchor lasya new house

anchor lasya new house

Lasya New House: బుల్లి తెర యాంకర్, బిగ్ బాస్ ఫేమ్  లాస్య తన సొంతింటి కలను నిజం చేసుకుంది. తాజాగా తన కొత్తింట్లోకి గృహప్రవేశం చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను లాస్య తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు.  మా కలల ఇళ్ళు గృహప్రవేశంతో శుభారంభం.. ప్రతి గోడలో ఒక కల, ప్రతి మూలలో ఒక జ్ఞాపకం! మా కొత్త గూడు.. కొత్త ఆరంభం అంటూ గృహ ప్రవేశం ఫొటోలు షేర్ చేసింది. 

లాస్య గృహప్రవేశ వేడుకలో రోజా సందడి 

ఫొటోలు చూస్తుంటే లాస్య చాలా విలాసవంతంగా తన ఇంటిని నిర్మించినట్లు తెలుస్తోంది. ఇంటి వ్యూవ్,  అలాగే ఫర్నీచర్ చాలా అందంగా కనిపించాయి.  లాస్య నూతన గృహ ప్రవేశ వేడుకలో సీనియర్ హీరోయిన్ మాజీ మంత్రి రోజా సందడి చేశారు.  కార్యక్రమంలో పాల్గొని లాస్య- మంజునాథ్ దంపతులను ఆశీర్వదించారు. ఈ ఫొటోలను లాస్య తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ.. మా గృహప్రవేశ వేడుకకు హాజరై.. మమల్ని ఆశీర్వదించినందుకు ధన్యవాదాలు అమ్మ! మీ ఆశీర్వాదాలతో మా రోజు మరింత ప్రత్యేకంగా మారింది అంటూ రోజాకు కృతజ్ఞతలు తెలిపింది లాస్య. 

బిగ్ బాస్ కంటెస్టెంట్స్ నోయల్, దేత్తడి హారిక, నయని పావని, బంచిక్ బబ్లూ, శ్వేతా నాయుడు, మెహబూబ్ తో పాటు పలువురు సెలబ్రెటీలు కూడా ఈ వేడుకకు హారయ్యారు. ఈ సందర్భంగా నోయెల్ ఈవెంట్ లో లాస్యతో దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. లాస్య చెప్పినట్టుగానే ఆమె కొత్త ఇల్లు అసూయ పుట్టించేలా ఉంది అంటూ పోస్ట్ పెట్టాడు. 

Also Read: Bigg Boss 9: బిగ్ బాస్ ఇంట్లో దీపావళి ధమాకా.. వెక్కి వెక్కి ఏడ్చిన సంజన! ఫుల్ జోష్ మీదున్న సుమన్ శెట్టి

Advertisment
తాజా కథనాలు