Bigg Boss 9: బిగ్ బాస్ 9 దీపావళి స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. కంటెస్టెంట్స్ ఆట, పాటలతో ప్రోమో సందడిగా కనిపించింది. దీపావళి పండగ సందర్భంగా హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్స్ కొత్త బట్టలు, స్వీట్లు గిఫ్ట్ చేశారు. దీంతో హౌజ్ మేట్స్ అందరూ ఫుల్ ఖుషీ అయిపోయారు. ఆ తర్వాత కొన్ని ఫన్ టాస్కులతో ప్రోమో నవ్వులు పూయించింది. ఈ ప్రోమోలో సుమన్ శెట్టి ఫుల్ జోష్ లో కనిపించాడు. అమ్మాయిలతో కలిసి దాయి దాయి దామ్మా పాటకు స్టెప్పులేస్తూ అదరగొట్టాడు.
ఫ్యామిలీ ఎమోషన్స్
ఆ తర్వాత హోస్ట్ నాగార్జున కంటెస్టెంట్లకు మరో అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు. ఫ్యామిలీ నుంచి వచ్చిన వీడియోలను ప్లే చేశారు. ప్రోమోలో సంజన, డెమోన్, సుమన్ శెట్టి ఫ్యామిలీ వీడియో ప్లే చేయగా.. చాలా ఎమోషనల్ అయ్యారు. సంజన తన 5 నెలల పాపను, భర్తను చూసి భావోద్వేగానికి గురైంది.
Also Read: Chings Add: వామ్మో.. రూ. 150 కోట్లతో యాడ్ షూటా! అట్లీ డైరెక్షన్ లో శ్రీలీల, రణ్‌వీర్ సింగ్!
Follow Us