జపాన్ లో 'లాపాటా లేడీస్' భారీ విజయం.. ఏకంగా షారుక్ , ప్రభాస్ ని వెనక్కి నెట్టేసిందిగా

ఇటీవలే జపాన్ విడుదలైన 'లాపాటా లేడీస్' భారీ వసూళ్లను రాబడుతోంది. సినీ ట్రేడ్ వర్గాల ప్రకారం 45 రోజుల్లో 50 మిలియన్ యెన్‌లను కలెక్ట్ చేసింది. పఠాన్,  సలార్: పార్ట్ 1 వసూళ్లను అధికమించి.. అక్కడ ఆల్ టైమ్ అత్యంత విజయవంతమైన హిందీ సినిమాలలో ఒకటిగా నిలిచింది.

New Update

జపాన్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన హిందీ చిత్రంగా 

ఇటీవలే జపాన్ విడుదలైన ఈ చిత్రం అక్కడ భారీ వసూళ్లను రాబడుతోంది. సినీ ట్రేడ్ వర్గాల ప్రకారం జపాన్ లో పఠాన్,  సలార్: పార్ట్ 1 వసూళ్లను 'లాపాటా లేడీస్‌' అధికమించి.. అక్కడ ఆల్ టైమ్ అత్యంత విజయవంతమైన హిందీ సినిమాలలో ఒకటిగా నిలిచింది. 45 రోజుల్లో 50 మిలియన్ యెన్‌లను కలెక్ట్ చేసింది.  ఇప్పటి వరకు జపాన్ లో అత్యధిక వసూళ్ళు సాధించిన చిత్రంగా SS రాజమౌళి 'RRR' చిత్రం కొనసుగుతోంది. జపాన్ లో RRR దాదాపు 75 మిలియన్ యెన్లు కలెక్ట్. త్వరలో ‘లాపాటా లేడీస్‌' RRR రికార్డులను బీట్ చేసే అవకాశం ఉంది. షారుఖ్ ఖాన్ పఠాన్ సుమారుగా 50 మిలియన్ యెన్‌లను కలెక్ట్ చేయగా..  ప్రభాస్ సలార్ సుమారు 46 మిలియన్ యెన్‌లను సంపాదించినట్లు సక్‌నిల్క్ నివేదిక తెలిపింది.  

Also Read: రెహ్మాన్ పై నాకు ఇంకా ప్రేమ ఉంది..! విడాకుల తర్వాత భార్య సంచలన ప్రకటన!

ప్రపంచవ్యాప్తంగా లాపాటా లేడీస్ దాదాపు రూ. 31 కోట్లు సాధించింది.  అందులో రూ. 25 కోట్ల గ్రాస్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ నుంచి వచ్చాయి. ఈ  జపాన్ గణాంకాలు కూడా విజయవంతమైన రన్‌ను సూచిస్తున్నాయి.

Also Read: షారుఖ్, సల్మాన్ కాదు.. భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ ఈ తెలుగు హీరోదే..? ఒక్క సినిమాకు 300 కోట్లు

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe