/rtv/media/media_files/2025/09/27/lokah-chapter-2-2025-09-27-15-15-28.jpg)
Lokah Chapter 2
Lokah Chapter 2: ఈ మధ్య చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద విశేషంగా అలరిస్తున్నాయి. పెద్ద స్టార్ కాస్ట్ లేకపోయినా, కథలో ఉన్న బలంతోనే ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా మలయాళంలో వచ్చిన ‘లోక Chapter 1: చంద్ర’ అనే చిత్రం ఇదే విషయాన్ని మరోసారి నిరూపించింది. కళ్యాణి ప్రియదర్శన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సూపర్ హీరో సినిమా ₹30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి, కేవలం కొన్ని రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి భారీ విజయాన్ని అందుకుంది.
Also Read: 'లిటిల్ హార్ట్స్' ఇప్పుడు ఈ టీవీ విన్ లో.. స్పెషల్ సర్‌ప్రైజ్ కూడా!
₹185 కోట్ల వసూలు..
డైరెక్టర్ డోమినిక్ అరుణ్ రూపొందించిన ఈ సినిమా 11 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ₹185 కోట్లు వసూలు చేసి సంచలనంగా మారింది. ప్రస్తుతం ₹200 కోట్ల క్లబ్‌కి చేరబోతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇండియాలోనే కాదు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. అక్కడ $10 మిలియన్ల (₹91 కోట్లు) వసూళ్లను రాబట్టింది. తెలుగులో ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థ విడుదల చేసింది.
Also Read: పవర్ స్టార్ సంచలనం.. ఏపీ & తెలంగాణలో 'OG' రికార్డుల మోత!
ఈ చిత్రం ఘన విజయం సాధించడంతో, ఇప్పుడు మేకర్స్ సీక్వెల్‌ను ప్రకటించారు. తాజాగా 'లోక Chapter 2' అనే టైటిల్‌తో కొత్త సినిమా అనౌన్స్ చేశారు. ఈ సారి కథ నాయకుడిగా తోవినో థామస్ నటించనున్నాడు. డైరెక్టర్‌గా మళ్లీ డోమినిక్ అరుణ్ కొనసాగుతారు. దుల్కర్ సల్మాన్ ఈ స్పెషల్ అనౌన్స్‌మెంట్‌ను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ, తాను తోవినోతో చేసిన సరదా సంభాషనతో కూడిన ప్రోమోను విడుదల చేశారు.
Also Read:‘కాంతార: చాప్టర్ 1’ తెలుగు ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్ గా ఆ స్టార్ హీరో..
ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్‌గా జేక్స్ బీజాయ్ పనిచేయనున్నాడు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అయితే రిలీజ్ డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు. మొదటి భాగానికి వచ్చిన క్రేజ్‌కి మించి ఈ సీక్వెల్ ఎలా ఉంటుందో అని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Follow Us