Kishkindhapuri Review: గతంలో 'రాక్షసుడు' అనే సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్ తో ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టిన బెల్లంకొండ శ్రీనివాస్ ఇప్పుడు కిష్కిందపురి అంటూ మరో హారర్ థ్రిల్లర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్- అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'కిష్కిందపురి' మరో 24 గంటల్లో థియేటర్స్ లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి హైదరాబ్స్ లోని AAA ముల్టీప్లెక్స్ లో ప్రీమియర్ షో ప్రదర్శించగా.. సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సినిమా చూసిన వారు సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూలు పెడుతున్నారు. మరి ట్విట్టర్ రివ్యూలా ప్రకారం 'కిష్కిందపురి' రివ్యూ ఎలా ఉందో ఇక్కడ చూసేద్దాం..
#KishkindapuriReview:
— Movies4u Reviews (@Movies4uReviews) September 10, 2025
The movie takes a little time to get to the main plot but picks up pace with some good horror moments, especially a chilling jump scare scene, and a solid interval twist. The second half keeps the momentum going with more surprises.
Technically, it’s…
ఫస్ట్ రివ్యూ
సినిమా స్టార్ అయిన తర్వాత కథలోకి వెళ్ళడానికి కొంచం టైమ్ తీసుకుంటుంది. మొదటి 10 నిమిషాలు కథను పరిచయం చేయడానికి ఉపయోగించారు డైరెక్టర్. ఆ తర్వాత కిష్కింధపురిలోని సువర్ణ మాయలోకి అడుగుపెట్టడంతో కథలో భయం, సస్పెన్స్ మొదలవుతాయి. అక్కడి నుంచి సినిమాను పరుగెత్తిస్తూ భయపెట్టేశాడు డైరెక్టర్. ఇక అదిరిపోయే ఇంటర్వెల్ ట్విస్టుతో సినిమా వేగం పుంజుకుంటుంది. ఎటువంటి అనవసరమైన హంగులు, సన్నివేశాలు లేకుండా అనుకున్న పాయింట్ ని చక్కగా ప్రజెంట్ చేస్తూ ఫస్ట్ హాఫ్ ముగించేశాడని ప్రేక్షకులు చెబుతున్నారు. అంతేకాదు బెల్లంకొండ శ్రీనివాస్ కెరీర్‌లో మంచి హిట్ అవుతుందని చెబుతున్నారు.
ఇక సెకండ్ హాఫ్ లో కూడా కథ అంతే ఇంట్రెస్టింగ్ గా, గ్రిప్పింగ్ గా ముందుకు తీసుకెళ్లాడు డైరెక్టర్. ఫస్ట్ హాఫ్ ని మించిన ట్విస్టులు సెకండ్ హాఫ్ లో ఉంటాయి. హారర్ ఎలిమెంట్స్ , ట్విస్టులు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయి. బెల్లంకొండ శ్రీనివాస్ నటన, స్క్రీన్ ప్రజెన్స్ ఆకట్టుకున్నాయి. అతడికి ఈ జానర్ బాగా సెట్ అవుతుందని చెప్పొచ్చు. డైరెక్టర్ స్టోరీ నరేషన్, ట్విస్టులు, థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ బాగున్నాయని చెబుతున్నారు. ఇక హీరోయిన్ అనుపమ నటన అద్భుతంగా ఉందని.. ఆసుపత్రిలో ఆమె నటించిన సన్నివేశం సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు.
కథతో పాటు టెక్నీకల్ పరంగా కూడా సినిమా అదిరిపోయిందని చెబుతున్నారు ఆడియన్స్. స్క్రీన్ ప్లే, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ నెక్ట్ లెవెల్లో ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా హారర్ సీన్స్ లో వచ్చే బీజీఎం గూస్ బంప్స్ అని అంటున్నారు. ఇక సినిమా చివరిలో పార్ట్ 2 కి లీడ్ ఇస్తూ.. లాస్ట్ మినిట్ ట్విస్ట్ అదిరింది చెబుతున్నారు. మొత్తంగా కిష్కిందపురి హారర థ్రిల్లర్స్ ఇష్టపడేవారిని ఆకట్టుకుంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో ''సినిమా స్టార్ట్ అయిన 10 నిమిషాల తర్వాత ఫోన్ పట్టుకుంటే ఇండస్ట్రీని వదిలేస్తా'' అంటూ విసిరిన ఛాలెంజ్ లో శ్రీనివాస్ సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది.
Also Read: Kishkindhapuri: ఆడియన్స్ అలా చేస్తే ఇండస్ట్రీనే వదిలేస్తా! బెల్లంకొండ శ్రీనివాస్ షాకింగ్ ఛాలెంజ్